Begin typing your search above and press return to search.

ఆమెకు వచ్చిన కలతో టెస్టులు చేయిస్తే.. పోవాల్సిన ప్రాణం నిలిచింది

By:  Tupaki Desk   |   13 Feb 2021 12:30 PM GMT
ఆమెకు వచ్చిన కలతో టెస్టులు చేయిస్తే.. పోవాల్సిన ప్రాణం నిలిచింది
X
కొన్ని ఉదంతాల్ని విన్నంతనే అస్సలు నమ్మలేం. నమ్మశక్యంగా ఉండని ఇలాంటి ఉదంతాలు వింటే విస్మయానికి గురి కావాల్సిందే. నిద్రలో కలలు రావటం.. లేచిన తర్వాత వాటిని మర్చిపోవటం సహజంగా జరుగుతుంటాయి. అయితే.. కొన్ని కలలు మాత్రం అదే పనిగా వెంటాడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరికి తమ కలలో వచ్చిన విషయాలే నిజమవుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఇంగ్లండ్ కు చెందిన 51 ఏళ్ల కరోలన్ బ్రూస్ అనే మహిళకు ఎదురైంది. ఆమెకు వచ్చిన కలే.. ఈ రోజున ఆమె ప్రాణాలతో ఉండేలా చేసిందని చెప్పక తప్పదు.

హాస్పిటల్ లో నర్సుగా ఉండే ఆమెకు గడిచిన కొద్దిరోజులుగా భయంకరమైన కలలు వస్తున్నాయి. దీంతో.. నిద్ర పోలేని పరిస్థితి. ఇలా ఆమె నిద్రకు దూరం అయిపోయారు. ప్రతి సందర్భంలోనూ ఆమె తాను చనిపోయినట్లుగా కల కనేవారు. ఇదిలా ఉంటే.. ఒకరోజు ఆమెకు వచ్చిన కలలో బ్రెస్ట్ క్యాన్సర్ తో బారినపడినట్లు వచ్చింది. దీంతో.. ఆమె ఆసుపత్రికి వెళ్లి.. పరీక్షలు చేయించుకున్నారు.

ఆశ్చర్యకరంగా వచ్చిన ఫలితాలు షాకింగ్ గా మారాయి. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడినట్లు.. ప్రస్తుతం స్టేజ్ 2 ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది ప్రాణాల్ని కాపాడుకున్నారు. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. ఆసుపత్రిలో చేరిన తర్వాత మళ్లీ తాను చనిపోయినట్లు కల రాలేదని చెప్పుకొచ్చారు. తనకొచ్చిన కల.. తనను అలెర్టు చేసినట్లుగా చెబుతున్నారు.