Begin typing your search above and press return to search.
శభాష్.. కరోనా రోగిని కౌగిలించుకున్న డాక్టర్..
By: Tupaki Desk | 2 Dec 2020 3:31 AM GMTకరోనా పేషెంట్ అంటేనే భయపడిపోయే రోజులివి. ఓ కాలనీలో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే చాలు.. ఈ వీధివైపే జనాలు చూడటం లేదు. కరోనా వచ్చిన వ్యక్తి బంధువులు, సన్నిహితులను కూడా ఎవరూ ఇళ్లకు రానివ్వడం లేదు. ఎంత అవగాహన పెంచుతున్నా కూడా చాలా మందికి వివక్ష చూపడం ఆపలేదు. కరోనా రోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నర్సులు, డాక్టర్లు వాళ్లకు సాధ్యమైనంత దూరంగానే ఉండి వైద్యం చేస్తుంటారు. దీంతో చాలా మంది కరోనా పేషెంట్లు మానసికంగా కుంగిపోయారు. అయితే తాజాగా ఓ డాక్టర్ మాత్రం కరోనా రోగిని హగ్ చేసుకున్నాడు. పీపీఈ కిట్ వేసుకొని కరోనా పేషెంట్ దగ్గరకు వెళ్లి.. అతడిని కౌగిలించుకున్నాడు. ఆ డాక్టర్ చేసిన పనికి ఇప్పుడు అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.
యూఎస్ టెక్సాస్ లోని హూస్టన్‌లో యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్‌లో డాక్టర్ జోసెఫ్ వరోన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు. 252 రోజులుగా అతడు ఆస్పత్రిలోనే చికిత్సలు అందజేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ రోజు ఆస్పత్రికి వెళ్లి ఇంటెన్సివ్ కేర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ రోగిని పలకరించాడు. అయితే ఆ పెషెంట్ డాక్టర్‌కు తన బాధను చెప్పుకున్నాడు.
తనతో ఎవరూ మాట్లాడం లేదని.. తనకు చాలా బాధగా ఉందని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే ఆ రోగిని హగ్చేసుకొని ధైర్యం చెప్పాడు. ధైర్యంగా ఉండాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జోసెఫ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డాక్టర్లంతా ఇలాగే ఉండాలని సూచిస్తున్నారు. ‘నీకు నేను ఉన్నాను’ అంటూ ధైర్యం చెప్పాడు. కరోనా రోగులను మరీ అంటరానీవాళ్లలా చూడొద్దని తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్లకు దగ్గరకు వెళ్లాలని .. ఫోన్లో పలకరించాలని.. అవసరమైన సాయం చేయాలని ఇప్పటికే పలువురు మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.