Begin typing your search above and press return to search.

మత్తు మందు ఇచ్చి ఆ డాక్టర్ అసహజ శృంగారం.. ఏం చేసేవాడంటే?

By:  Tupaki Desk   |   15 Feb 2021 4:08 AM GMT
మత్తు మందు ఇచ్చి ఆ డాక్టర్ అసహజ శృంగారం.. ఏం చేసేవాడంటే?
X
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. గత ఏడాది ఆగస్టులో ఇద్దరు రెండో పెళ్లిని చేసుకున్నారు. ఆ ఇల్లాలికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త సెక్సువల్ గా వేధించాడు. అత్త చిత్రహింసలు పెట్టింది. చివరి ఆ ఇల్లాలు భర్త అసహజ శృంగారం, అత్తమామల వేధింపులతో తనువు చాలించింది. 18 పేజీల లేఖలో భర్త చేసే అసహజ శృంగార పోకడలను వివరించింది. అదిప్పుడు వైరల్ అయ్యింది.

అహ్మదాబాద్ లోని ఘట్లోడియాకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ హితేంద్ర పటేల్ గత ఏడాది ఆగస్టులో హర్ష అనే విడాకులు తీసుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే చేసుకున్నాక అత్తా మామలు కట్నం కోసం వేధించేవారు. భర్త ఈమెకు సపోర్టుగా మాట్లాడకపోగా తల్లిదండ్రులకు సపోర్టుగా హింసించాడని ఆమె వాపోయింది. చిన్న విషయానికి దాడి చేసి ఇబ్బందులకు గురిచేసేవాడట..

రాత్రయితే చాలు ఆ మహిళకు ఆ డాక్టర్ నరకం చూపించేవాడట.. హితేంద్ర డాక్టర్ కావడంతో రోజు తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాడని.. బలవంతంగా తనతో సెక్స్ చేసేవాడని.. మత్తుతో తాను సృహ కోల్పోతే తనపై అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని సూసైడ్ నోట్ లో పేర్కొంది. దీంతో వీరి బాధలు భరించలేక ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.

18 పేజీల సూసైడ్ నోట్ లో భర్త హితేంద్ర తనపై చేసే అసహజ శృంగారాన్ని వివరించింది. అత్తా మామల అదనపు కట్నం హింసను రాసుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.