Begin typing your search above and press return to search.

భార్య విషయంలో జోక్యం..: గురువుని హత మార్చిన శిష్యుడు..

By:  Tupaki Desk   |   4 Jun 2022 4:16 AM GMT
భార్య విషయంలో జోక్యం..: గురువుని హత మార్చిన శిష్యుడు..
X
గురువుకు తగ్గ శిష్యులుంటారు.. గురువును మించిన శిశ్యులుంటారు.. కానీ ఇక్కడ ఓ శిష్యుడు ఏకంగా తన గురువును హత్య చేశాడు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి హతమార్చాడు.. తన భార్య విషయంలో గురువు జోక్యం చేసుకున్నాడని పగ పెంచుకున్నఆయన.. సదరు వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంఘటన కర్ణాటకలోని హాసన్ లో కలకలం చేసింది. అయితే ఆ గురువు ఎవరో కాదు ప్రముఖ ప్రజాప్రతినిధి. అంతేకాదు ప్రముఖ పార్టీకి చెందిన మాజీ ప్రధాని, మాజీ ముఖ్యమంత్రికి సన్నిహిత వ్యక్తి. పవర్ ఫుల్ కౌన్సిలర్ గా, లీడర్ గా కూడా పేరు తెచ్చుకున్న ఆయన హత్యపై ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం.. హసన్ పట్టణంలోని శాంతినగర్ 16వ వార్డు కౌన్సిలర్ గా ప్రశాంత్ కొనసాగుతున్నాడు. జేడీఎస్ తరుపున గెలిచిన ఈయన పార్టీకి నమ్మకస్తుడు. అంతేకాకుండా జేడీఎస్ అధినేత దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారాస్వామి గౌడకు ప్రధాన సన్నిహితుడు. ఇక మాజీ మంత్రి హెచ్ డి రేవణ్ణ, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండేవారు. దీంతో ప్రశాంత్ పవర్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్న ఆయన వెంట నిత్యం అనుచరులు ఉంటూంటారు. తన వార్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కరించేందుకు కృషి చేసేవాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కు రాజకీయంగా కొందరు శత్రువులు తయారయ్యారు.

అయితే ప్రశాంత్ కు పూర్ణచంద్ర అనే వ్యక్తి శిష్యుడిగా మారాడు. ప్రతి రోజూ ప్రశాంత్ తో కలిసి అన్నా.. అన్నా.. అంటూ వెంటుండేవాడు. ఈ క్రమంలో పూర్ణచంద్రకు ఓ అమ్మాయితో పెళ్లి జరిగింది. కొన్ని రోజుల తరువాత భార్యభర్తల మధ్య గొడవలు స్ట్రాట్ అయ్యాయి. పూర్ణచంద్ర ఈ విషయాన్ని ప్రశాంత్ తో చెప్పాడు. దీంతో తన శిష్యుడి సమస్యను పరిష్కరించాలని అనుకున్నాడు ప్రశాంత్ . ఓ రోజు తన ఇంటికి పూర్ణచంద్ర దంపతులను పిలిపించుకున్నాడు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి మెలిసి ఉండాలని సూచించాడు.

ఆ తరువాత ఇంటికి వెళ్లిన పూర్ణచంద్ర దంపతులు కొన్ని రోజులు పాటు కలిసిమెలిసి ఉన్నా.. ఆ తరువాత మళ్లీ గొడవలు జరగడంతో పూర్ణచంద్ర భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి రాలేదు. అయితే తన భార్య పుట్టింటికి వెళ్లడానికి గురువు ప్రశాంతే కారణమని పూర్ణచంద్ర అతనిపై పగ పెంచుకున్నాడు. అతని వల్లే తన భార్య తనకు దూరమైందని భావించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ పై పగ పెంచుకొని అతడిని హతమార్చాలని అనుకున్నాడు.

నిత్యం అనుచరులతో ఉండే ఆ కౌన్సిలర్ ఓ రోజు ఒంటరిగా బైక్ పై వెళ్లాడు. ఇదే అదునుగా చూసిన కొందరు ఆటోలో అతడిని వెంబడించారు. హాసన్ లోని జవనేహళ్లి మఠం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపేశారు. అయితే పలు సమస్యలు పరిష్కారానికి చొరవ చూపే ప్రశాంత్ ను రాజకీయ ప్రత్యర్థులే హత్య చేశారని మొదట భావించారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత అసలు విషయం బయటపడింది. ప్రశాంత్ హతమార్చింది అతని శిష్యుడు పూర్ణచంద్రేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు.ఆ తరువాత పూర్ణచంద్రను విచారించగా పోలీసులకు అసలు విషయం చెప్పాడు.

భార్యభర్తల మధ్య గొడవ జరిగితే పరిష్కారానికి వెళ్లొద్దంటారు..కానీ ప్రశాంత్ తన శిశ్యుడి కాపురాన్ని బాగు చేయడానికి చొరవ చూపాడని, సంసారాన్ని బాగుచేద్దామనుకున్న అతడే హత్యకు గురయ్యాడని ప్రశాంత్ సన్నిహితులు చర్చించుకుంటున్నారు. హాసన్ పట్టణంలో రాజకీయాలకు అతీతంగా ఉండే ప్రశాంత్ తన శిష్యుడి చేసితో హత్యకు గురికావడం కలకలం రేపింది.