Begin typing your search above and press return to search.
కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధుల లెక్కలు బయటకొచ్చాయి
By: Tupaki Desk | 24 Sep 2020 7:50 AM GMTప్రజలు కనెక్టు అయ్యే విషయాల్ని ప్రస్తావించటంలో తెలంగాణ అధికారపక్షానికి ఉన్న టాలెంట్ అంతా ఇంతా కాదు. మిగిలిన విషయాల మీద ఫోకస్ పెట్టకుండా గులాబీ అధినేతతో సహా.. ఆ పార్టీకి చెందిన నేతలు పలువురు తరచూ కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తుంటారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఇవ్వటం లేదన్న విమర్శను వారు తరచూ చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా లోక్ సభ సమావేశాల సందర్బంగా తెలంగాణకు కేంద్రం నుంచి పలు కార్యక్రమాల కింద విడుదలైన మొత్తాల గురించి లిఖిత పూర్వక సమాధానాలు బయటకు వచ్చాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు తాజాగా కేంద్రాన్ని పలు ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానాలు ఇచ్చే క్రమంలో తెలంగాణకు తాము ఇస్తున్న నిధుల వివరాల్ని వెల్లడించారు. పచ్చదనం పెంపులో భాగంగా కాంపా కింద కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.3110.3 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గడిచిన ఐదేళ్ల వ్యవధిలో నిర్భయ పథకం కింద ఏపీకి రూ.109.22 కోట్లు ఇస్తే.. తెలంగాణకు రూ.179.65 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. జాతీయ చేనేత డెవలప్ మెంట్ పథకం కింద 2015 నుంచి ఇప్పటివరకు తొమ్మిది క్లస్టర్లను మంజూరు చేసినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తుందన్న వాదన తప్పన్న రీతిలో కేంద్రం నుంచి సమాధానాలు ఉండటం గమనార్హం. అయితే.. ఈ ప్రశ్నలన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంధించారు.