Begin typing your search above and press return to search.
మోడీలో తగ్గుతున్న మొండితనం.. మరోసారి ఫ్రూవ్ అయ్యింది
By: Tupaki Desk | 30 May 2021 3:37 AM GMTఎవరేమన్నా.. ఎంత గొంతు చించుకున్నా.. మరెంత ఒత్తిడి తెచ్చినా? విపక్షాలు విరుచుకుపడినా.. వారు లేవనెత్తిన అంశాల్ని లైట్ తీసుకోవటం.. వారెంత మొత్తుకున్నా పట్టనట్లుగా ఉండటం ప్రధాని మోడీకి ఉన్న అలవాటుగా చెబుతారు. తన ఏడేళ్ల పాలనలో ఆయనీ విషయాన్నిచాలాసార్లు చేసి చూపించారు. తనకు తానుగా ఆలోచన రావాలే తప్పించి.. విపక్షాలు చెప్పిన మాటల్ని తీసుకునేందుకు.. వారి సూచనల్ని అమలు చేయటానికి ససేమిరా అనే ఆయన్ను మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణిస్తుంటారు.
అలాంటి ఆయనలోని మొండి ఘటాన్ని కరోనా కదిలించినట్లుగా చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని బ్యాక్ ఫైర్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో పాటు.. ఆయన పాలనలోని లోపాల్ని విపక్షాలు అదే పనిగా ఎత్తి చూపటం.. అందుకు దేశ ప్రజల నుంచి సానుకూల స్పందన రావటంతో మోడీ సర్కారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితి.
గతంలో విపక్షాల్ని అస్సలు పట్టించుకోకపోవటానికి కారణం.. ప్రజలు తమ వైపు ఉన్నారన్న ధీమానే. అందుకు భిన్నంగా సెకండ్ వేవ్ లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవటం.. గడిచిన ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం సాగటమే కాదు.. మోడీకి వ్యతిరేకంగా వస్తున్న వాదనలకు అమితమైన ప్రజాదరణ లభించటం మోడీలో మార్పునకు కారణంగా చెబుతున్నారు.
కరోనా కష్టకాలంలో సీబీఎస్ఈ పరీక్షల్నిరద్దు చేయాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేయటం.. దాన్ని మొదట్లోఅంతగా సీరియస్ గా తీసుకోని ప్రధాని మోడీ.. తర్వాత రోజుల్లో కాంగ్రెస్ చెప్పినట్లే సీబీఎస్ఈ నిర్వహించే వార్షిక పరీక్షల్ని రద్దు చేయక తప్పలేదు. తర్వాతి కాలంలో లాక్డౌన్ విధించాలని డిమాండ్ చేసిన విపక్షాల్ని లైట్ తీసుకోవటం.. అందుకు భారీ మూల్యాన్ని మోడీ చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుందన్న ఉద్దేశంతో.. లాక్ డౌన్ విధించటానికి సంశయించిన మోడీ బాటలోనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడిచి.. అడ్డంగా బుక్ అయ్యారు.
దీంతో.. తాము చేస్తున్న తప్పుల్ని తెలుసుకొని లాక్ డౌన్ విధించటంతో ఇప్పుడిప్పుడే కేసుల నమోదులో మార్పు వస్తోంది. ఇలాంటివేళలో.. కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకున్న పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ తీసుకొచ్చింది. దీని విషయంలోనూ ఎప్పటిలానే మోడీ సర్కారు లైట్ తీసుకుంది. కానీ.. ఈ డిమాండ్ కు ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తం కావటమే కాదు.. కొవిడ్ మరణాలపై కన్నీళ్లు కార్చిన ప్రధాని మోడీ.. పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లలకు సాయం అందించే విషయంలో ఎందుకు స్పందించటం లేదన్న విమర్శలకు మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది.
చివరకు.. ఇలాంటి పిల్లల్ని ఆదుకునేందుకు ప్రధాని మోడీ తాజాగా విధివిదానాల్ని ప్రకటించారు. దీని ప్రకారం కొవిడ్ కారణంగా అనాధలైన ప్రతి ఒక్కరికి రూ.10లక్షల కార్పస్ ఫండ్ కేటాయిస్తారు. వారు చదువులుపూర్తి అయ్యే వరకు ఉచిత విద్యను అందిస్తారు. వారు ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయానికి ఇది అదనం కావటం గమనార్హం. పీఎం కేర్ ఫండ్ లో భాగంగా పిల్లలు 18-23 వయసుకు మధ్యలో కొంత మొత్తాన్ని స్టైఫండ్ గా అందజేస్తారు. వారికి 23 ఏళ్లు వచ్చిన తర్వాత కార్పస్ ఫండ్ మొత్తాన్నిసొంత అవసరాలకు లేదంటే ఉపాధి కోసం వాడుకునేలా డిజైన్ చేశారు. ఈ పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నా.. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్నట్లుగా వారికి ఫీజులు పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు.
మోడీ ప్రకటించినపథకం బాగానే ఉన్నా.. దాని టైమింగ్ ఏ మాత్రం బాగోలేదంటున్నారు. అనాద పిల్లలకు పెద్ద ఎత్తున సాయం చేయాలన్న డిమాండ్.. ఒత్తిడి పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత స్పందించే బదులు ముందే స్పందించి.. ఈ అభయాన్ని ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. మొండిఘటంగా ఉండే మోడీ.. ఇప్పుడు విపక్షాల డిమాండ్లకు తలొగ్గుతున్నారు. కాలమహిమ అంటే దీన్నే అంటారు మరి.