Begin typing your search above and press return to search.

గులాబీ ముఖ్యనేత కక్కుర్తి.. ప్రాణాలు తీసిన దక్కన్ మాల్ కూలిపోనుంది

By:  Tupaki Desk   |   20 Jan 2023 6:30 AM GMT
గులాబీ ముఖ్యనేత కక్కుర్తి.. ప్రాణాలు తీసిన దక్కన్ మాల్ కూలిపోనుంది
X
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదలైన ఒక అగ్నిప్రమాదం.. ముగ్గురు ప్రాణాలు (అధికారికంగా ప్రకటించలేదు) తీయగా.. భారీ నష్టం వాటిల్లేలా చేసింది. ప్రస్తుతం కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భారీ భవంతికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారి కారణంగా.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టం తీవ్రంగా ఉంటోంది. ఆ మధ్యన సికింద్రాబాద్ పరిధిలోని మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

తాజాగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది సికింద్రాబాద్ లోని నల్లగుట్టలోనే. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఈ భారీ భవంతిని అక్రమంగా నిర్మించారు.తొలుత నిబంధనల ప్రకారం నిర్మించినా.. తర్వాతి కాలంలో తెలంగాణ అధికారపార్టీకి చెందిన ఒక ముఖ్యనేత కుటుంబం ఆ భవనాన్ని..

ఇష్టారాజ్యంగా నిర్మించటం తాజా ప్రమాదం భారీగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు మొదలైన ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా ఎగిసిపడే మంటల్ని ఆర్పేందుకు భారీగా ఫైరింజన్లను రంగంలోకి దించినా.. ఫలితం లేకపోయింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటల ప్రాంతానికి కూడా మంటలు అదుపులోకి రాలేదని చెబుతున్నారు. భవనం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో ఏ క్షణంలోఅయినా బిల్డింగ్ ను కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం.. ఈ మాల్ లో ఉన్న దుకాణాలన్ని కూడా మంటల తీవ్రతను పెంచేవిగా ఉండటంతో తీవ్రతమరింత ఎక్కువైందని చెప్పాలి. మంటల వేడికి పిల్లర్లు. స్లాబ్ లోని ఐరన్ కూడా పూర్తిగా దెబ్బ తిన్నదని.. ఏ క్షణంలో అయినా భవనం కుప్పకూలయటం ఖాయమంటున్నారు. భవనంలో చిక్కుకున్న ముగ్గురు ఆచూకీ లభించటం లేదు. వారి చనిపోయి ఉంటారని భావిస్తున్నా.. అధికారులు ఆ విషయాల్ని వెల్లడించటం లేదు.

బ్యాడ్ లక్ ఏమంటే.. మంటలు పెరిగిన తర్వాత బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన వారిలో ముగ్గురు.. ఇంకా భవనంలో ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తామంటూ లోపలకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నారు. వారు భవనంలోకి వెళ్లే వేళలో అధికారులు వారిని అడ్డుకున్నా.. మాట వినకుండా లోపలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. గురువారం మొత్తం 40 ఫైరింజన్లతో మంటల్ని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి కుటుంబం ప్రదర్శించిన కక్కుర్తి.. వారి లెక్కలేనితనం ప్రమాద తీవ్రతను మరింత పెంచిందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.