Begin typing your search above and press return to search.
అమెరికాలో టీఆర్ఎస్ యువనేతను చంపేశారా?
By: Tupaki Desk | 29 Dec 2020 11:00 AM GMTతెలంగాణ అధికారపక్ష అధికార ప్రతినిధి కమ్ యువనేత దేవేందర్ రెడ్డి నల్లమడ అమెరికాలో దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు గురైన సమయంలో ఆయన తన కారులోనే ఉండటం గమనార్హం. నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన ఆయన తాజాగా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో హత్యకు గురయ్యారు. ఎవరు చంపారు? ఎలా చంపారు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాలేదని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గులాబీ నేత హత్యకు కారణాలపై పోలీసులు ఇస్తున్న సమాచారం సరిగా లేదన్న విమర్శ వినిపిస్తోంది. దీంతో.. దీనిపై కొత్త సందేహాలకు తెర తీస్తోంది.
హత్య జరిగిన సమయంలో దేవేందర్ రెడ్డి తన కారులోనే కూర్చొని.. ఫోన్ లో మాట్లాడుతుండగా హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇందులో వాస్తవం లేదని.. కారులో కూర్చొని మాట్లాడుతున్న వేళ.. వాహనంలో చెలరేగిన మంటలతోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. ఎలా మరణించారన్న విషయాన్ని సమగ్ర విచారణ తర్వాతే చెబుతామని అక్కడి పోలీసులు చెప్పటంతో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే దేవేందర్ రెడ్డి కూర్చున్న కారుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కారు డ్యామేజ్ అయిన తీరు చూస్తే..ఏదో పేలుడు జరిగినట్లుగా కనిపిస్తోంది. సాయం కోసం అడిగినంతనే స్పందించే గుణం ఉన్న నేత.. ఇలా మరణించటం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆయన మరణంపై అమెరికాలోని పలువురు తెలుగు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవేందర్ మరణం వెనుక మిస్టరీని తేల్చాలని కోరుతున్నారు. కారు అంతలా డ్యామేజ్ ఎలా అయ్యింది? ఎవరు చేశారు? మరణించిన సమయంలో ఫోన్ మాట్లాడుతున్నది ఎవరితో అన్నది కూడా ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఈ ఎన్ ఆర్ఐ ప్రముఖుడి మరణం అమెరికాలోని తెలుగువారిలో అలజడికి కారణమవుతుందని చెప్పక తప్పదు.