Begin typing your search above and press return to search.
షాకిచ్చేలా మారిన ‘స్వాతి’ మ్యాగ్ జైన్ ఎండీ మరణం
By: Tupaki Desk | 11 May 2021 4:32 AM GMTతెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వారపత్రిక ‘స్వాతి’. ఇప్పుడంటే డిజిటల్ మీడియా వచ్చేసింది కానీ.. ముప్ఫై నలభై ఏళ్ల క్రితం తెలుగు ప్రజల్ని తన రాతతో.. శైలితో ఆకట్టుకున్న వారపత్రికల్లో తిరుగులేని స్థానం స్వాతిదే. ఆ సంస్థ ఎండీ వేమూరి బలరామ్ అందరికి సుపరిచితమే. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె మణిచందన. ఆమె స్వాతి వారపత్రికకు ఎండీగా వ్యవహరిస్తుననారు.
ఆమె తాజాగా అనారోగ్య కారణంగా మరణించిన వైనం షాకింగ్ గా మారింది. మణిచందన భర్త ఐటీ శాఖలో ప్రిన్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్నారు. మణిచందన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. దీనికి సంబంధించిన వైద్యం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేస్తున్నారు. అయినప్పటికి ఆమె అనారోగ్యం నుంచి బయటపడలేదు. తాజాగా ఆమెకు గుండెపోటు రావటంతో హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు. వైద్యం జరుగుతుండగానే ఆమె మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. తెలుగు వారికి సుపరితమైన స్వాతి పత్రికకు కీలకంగా ఉన్న మణిచందన మరణం.. స్వాతిని ఒక కుదుపునకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది. కరోనా కల్లోలంలో పడి. ఆమె మరణం పెద్దగా ప్రచారం కాలేదు. ఈ వార్త తెలిసిన వారంతా.. షాక్ తింటున్నారు. ఆమె అకాల మరణానికి పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.