Begin typing your search above and press return to search.

రోజులు మారాయ్‌.. ఎంపీ స‌ర్.. క‌లుపుకొని పోక‌పోతే.. క‌లుపుమొక్కే!!

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:32 AM GMT
రోజులు మారాయ్‌.. ఎంపీ స‌ర్.. క‌లుపుకొని పోక‌పోతే.. క‌లుపుమొక్కే!!
X
రాజ‌కీయాల్లో ఎప్పుడైనా.. నాయ‌కులు అంద‌రినీ క‌లుపుకొని పోవాల్సిందే. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ఇబ్బంది త‌ప్ప‌దు. ముఖ్యంగా సొంత పార్టీలో అయితే.. నాయ‌కుల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండా లి. ఎందుకంటే.. ఆయా నేత‌లే ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క రోల్ పోషిస్తారు. గెలిపించాల‌న్నా.. ఓడించాల‌న్నా.. వాళ్లే కీల‌కం. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. సొంత పార్టీ నేత‌ల‌తో క‌య్యం పెట్టుకుని.. విజ యం ద‌క్కించుకున్న నాయ‌కుడు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీలోనూ క‌నిపించ‌లేదు.

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోందంటే.. విజ‌య‌వాడ ఎంపీ.. కేశినేని నాని వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌పైనే కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీ అంటేనే లెక్క లేకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే వాద‌న పార్టీ నేత‌ల మ‌ధ్య వినిపిస్తోంది. ఒక‌ప్పుడు కేవ‌లం మాజీ ఎమ్మెల్సీ.. బుద్ధా వెంక‌న్న వ‌ర‌కే వివాదం న‌డిచింద‌ని అనుకుంటే.. త‌ర్వాత‌.. ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌తోనూ.. వివాదానికే కాలు దువ్వారు.

ఇక‌, ఇటీవ‌ల‌ విజ‌య‌వాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌.. నెట్టెం ర‌ఘురామ్‌పైనూ.. కేశినేని నాని.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ఉందా.. ఉన్నా చ‌ర్య‌లు తీసుకుంటోందా? అని.. ట్వీట్ చేశారు. అంతేకాదు.. ద‌మ్ముంటే.. నేను పంపించిన జాబితాలోని వారిపై చ‌ర్య‌లు తీసుకోండి చూస్తాను.. అని వ్యాఖ్యానించారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం విజ‌య‌వాడ వ‌ర‌కే అనుకున్న ఎంపీ దూకుడు.. జిల్లా వ‌ర‌కు పాకింది. ఆయ‌న‌కు అనుకూల వ‌ర్గంగా ఉన్న‌వారి సంఖ్య నానాటికీ త‌గ్గుతోంది. పైగా.. సొంత త‌మ్ముడే.. పోటీకి సై! అంటున్న ప‌రిస్థితి.. దీనికి అధిష్టానం ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉన్న ఓ కీల‌క నేత అండ‌గా ఉన్నార‌ని.. అంటున్నారు. దీంతో ఎంపీ హ‌వా రివ‌ర్స్ అవుతోంది.

దీంతో ఎంపీపై ఇప్పుడు కీల‌క నేత‌లు అంద‌రూకూడా.. వ్య‌తిరేకంగా మారిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. తాను నిజాయితీ ప‌రుడిన‌ని.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశాన‌ని.. త‌న‌కు తిరుగులేద‌ని.. ఎంపీ అనుకుంటే అనుకోవ‌చ్చు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను దూరం చేసుకుంటే.. అది ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలోనూ అనేక మంది నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అర్ధం చేసుకోలేక ప‌రాజ‌యం పాలైన ప‌రిస్థితి ఉంద‌నేది వాస్త‌వం. ఇదే విష‌యాన్ని త‌ర‌చుగా.. చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. అయినా.. ఎంపీ తీరు మార‌డం లేదు. ఈ ప‌రిస్థితే కొన‌సాగితే..ఆయ‌న‌ను మార్చేయ‌డం.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు.. పెద్ద ప‌నికాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.