Begin typing your search above and press return to search.

లోక్ సభ స్పీకర్ కుమార్తె సాధించింది..

By:  Tupaki Desk   |   5 Jan 2021 12:50 PM GMT
లోక్ సభ స్పీకర్ కుమార్తె సాధించింది..
X
లోక్ సభ స్పీకర్, ఎంపీ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఈరోజు గొప్ప ఘనత సాధించారు. ఏకంగా ఈరోజు విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు.

లోక్ సభ స్పీకర్ కుమార్తె అంజలి ఒక మోడల్, హీరోయిన్ కంటే కూడా అందంగా ఉన్నారు.. అందానికి మించి కష్టపడే గుణం కలదని తాజాగా నిరూపించుకున్నారు. ఏకంగా.మొదటి ప్రయత్నంలోనే అంజలీ దేశంలోనే అతి కష్టమైన ఐఏఎస్ పరీక్షల్లో పాసై ఏకంగా నంబర్ 1 ఆఫీసర్ గా నిలిచింది.

సివిల్ సర్వీసెస్ సాధించి కలెక్టర్ కావాలన్నది తన ఆశయమని.. దేశ ప్రజల పట్ల నా తండ్రి నిబద్ధతను నేను ఎప్పుడూ చూస్తుంటా.. సమాజం కోసం ఏదైనా చేయాలనే సివిల్ సర్వీసెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని మీడియాతో అంజలి తెలిపారు.

కాగా పరిపాలన సేవలో చేరాక మహిళా సాధికారత రంగంలో పనిచేయాలని అంజలి కోరుకుంటోంది. అంజలి ఎంపికతో కోటలోని శక్తినగర్ లో గల స్పీకర్ ఓంబిర్లా నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.