Begin typing your search above and press return to search.

న్యాయమూర్తిగా మహాకవి శ్రీ శ్రీ కుమార్తె

By:  Tupaki Desk   |   26 March 2022 8:30 AM GMT
న్యాయమూర్తిగా మహాకవి శ్రీ శ్రీ కుమార్తె
X
ఈ శతాబ్దం నాది అని గర్జించి గర్వంగా నినదించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావ్ ఉరఫ్ శ్రీశ్రీ. ఆయన అచ్చంగా డెబ్బై మూడేళ్ళ పాటు జీవించారు. 1983లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మహా ప్రస్థానం తెలుగు సాహితీ ప్రస్థానంలో మేలి మలుపు. శ్రీ శ్రీ అంతర్జాతీయ కవిగా సుప్రసిద్ధుడు. ఆయన తెలుగు సాహిత్య రంగంలో దృవతారగా వెలిగారు. తెలుగు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

ఆ మహాకవ్తి కుమార్తె నిడుమోలు మాలా ఇపుడు న్యాయమూర్తిగా మద్రాస్ హైకోర్టులో నియమితులయ్యారు. ఆమెను అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యారు. . మద్రాస్‌ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరిలో మాలా, ఎస్‌.సౌందర్‌ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఆమె శ్రీశ్రీ సరోజా దంపతుల నాలుగవ సంతానం. ఆమె న్యాయ విద్యను అభ్యసించి మద్రాస్ పుదుచ్చేరీ బార్ అసోసియేషన్ లో 1989లో మెంబర్ గా పేరు నమోదు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఉన్నత స్థానాన్ని ఆమె అందుకున్నారు. ఇక మాల పెద్ద‌ కుమారుడు, శ్రీశ్రీ మనవడు శ్రీనివాస్‌ జయప్రకాశ్‌ కూడా హైకోర్టులో న్యాయవాదిగా క్టీస్ చేయడం విశేషం.

మహాకవి సాహితీ రంగాన్ని సుసంపన్నం చేస్తే ఆయన వారసులు న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషంగా చూడాలి.

ఇక శ్రీశ్రీది విశాఖ జిల్లా. ఆయన మహా ప్రస్థానం విశాఖ సాగర తీరాల సాక్షిగా లిఖించబడింది. విశాఖలో ఆయన సాహితీ గోష్టులు ఎన్నో నిర్వహించారు. ఆయన నివసించిన ఒకనాటి ఇల్లు కూడా ఉంది. మొత్తానికి శ్రీశ్రీ వారసులు ఉన్నత స్థితికి రావడం పట్ల విశాఖ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.