Begin typing your search above and press return to search.
అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజు
By: Tupaki Desk | 11 Sep 2020 10:50 AM GMT2001 సెప్టెంబరు 11 ఈ తేదీని అమెరికన్ల తో పాటు ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకుంటాయి. 2001 సెప్టెంబర్ 11న నాలుగు ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసిన అల్ ఖైదా తీవ్రవాదులు...ఆ విమానాలతో ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్) - పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)తో పాటు - పెన్సిల్వేనియా ప్రాంతాల్లో దాడి చేశారు. అమెరికా చరిత్రలో అత్యంత చీకటి దినంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిన 9/11 దాడుల ఘటన ఈ రోజుకు చాలామంది అమెరికన్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. అల్ ఖైదా ఉగ్ర మూకలు అమెరికా లోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద విమానాలతో దాడులు జరిపి నేటికి 19 ఏళ్లు. ఆ దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోగా ...వేలాది మంది గాయ పడ్డారు. ఆ ముష్కర దాడిలో అశువులు బాసిన సాటి అమెరికన్లను చూసి మరి కొన్ని కోట్ల హృదయాలు గాయపడ్డాయి. ఈ దాడికి ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం లోని అల్ ఖైదాదే బాధ్యత అని - ఆ దాడులకు సంబంధించి ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. అయితే, కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తలు....ఆ దాడులను అమెరికా అడ్డుకోలేదని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, కుట్ర సిద్ధాంత కర్తలందరికీ దర్యాప్తు సంస్థల అధికారులు క్లారిటీ ఇచ్చారు. కుట్ర సిద్ధాంత కర్తల 5 ప్రధానమైన వాదనలు...వాటికి అధికారుల వివరణలు మరోసారి చర్చకు వచ్చాయి.
అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైనదని, హైజాక్ అయిన 4 విమానాల్లో ఒక్కదాన్ని కూడా ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది కుట్ర సిద్ధాంతకర్తల వాదన. వాటిని అడ్డగించ వద్దని మిలిటరీకి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చీనీ ఆదేశాలిచ్చారన్నది వారి ఆరోపణ.ఈ తరహాలో 4 విమానాలు ఒకేసారి హైజాక్ చేయడం చాలా అరుదని, విమానాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే ట్రాన్స్ పాండర్ ను తీవ్రవాదులు పని చేయకుండా చేసినందునే అడ్డుకో లేక పోయామని అధికారులు అంటున్నారు.
బాంబులు అమర్చి ట్విన్ టవర్లను ధ్వంసం చేశారన్నది కుట్ర సిద్ధాంతకర్తల వాదన. బాంబులతో కూల్చాలంటే కింది అంతస్తుల నుంచి మొదలుపెడతారు. ఈ ఘటనలో పై అంతస్తుల నుంచి ధ్వంసం ప్రారంభమైంది.భవనానికి పట్టునిచ్చే కీలక స్తంభాలను, అగ్ని నిరోధక వ్యవస్థను విమానాలు ధ్వంసం చేశాయని, చాలా అంతస్తుల్లో10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం చిమ్ముకోవడం వల్ల భారీ మంటలు చెలరేగాయని దర్యాప్తు అధికారులు వివరణ ఇచ్చారు. 1,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వల్ల భవనం కూలి 'పేలుడు' శబ్దాలు వచ్చాయన్నారు.
నైపుణ్యం లేని ఓ పైలట్ పెంటగాన్ మీద దాడి చేయడం, ఆ విమానం హైజాక్ అయిందని అధికారులకు తెలిసిన 78 నిమిషాల తర్వాత దాడి చేయడం సాధ్యమా అన్నది కుట్ర సిద్ధాంత కర్తల వాదన.పెంటగాన్ నియంత్రణ లోని క్షిపణి, చిన్న విమానం లేదా మానవ రహిత డ్రోన్ ఈ దాడి చేసిందన్నది వారి వాదన.ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్సులతో సహా విమానం శకలాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని వాటిలోని సమాచారాన్ని విశ్లేషించింది. కాబట్టి దాడి చేసింది విమానం నుంచే అని అధికారులు తేల్చారు. విమానంలోని సిబ్బంది, ప్రయాణికుల అవశేషాలు డీఎన్‌ఏ పరీక్షల్లో బయటపడ్డాయి. పెంటగాన్‌ను విమానం ఢీ కొట్టడాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు.
పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లే దగ్గర విమానం దాడి జరిగిన ప్రదేశంలో విమాన శకలాలు ఎందుకు కనిపించలేదన్నది కుట్ర సిద్ధాంత కర్తల వాదన. ఆ విమానాన్ని క్షిపణితో కూల్చివేయడంతో దాని శకలాలు చాలా దూరంలో పడ్డాయని వారు వాదిస్తున్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, విమాన శకలాల ఫొటోలు లభ్యమయ్యాయని, ప్రయాణికులు ఎదురుతిరగడంతో హైజాకర్లు విమానాన్ని కూల్చివేశారని తేలింది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం-7 ను విమానం ఢీకొనలేదని, పేలుడు పదార్థాలను, బాంబులను ఉపయోగించి నియంత్రిత కూల్చివేత పద్ధతిలో ధ్వంసం చేశారని కుట్ర సిద్ధాంత కర్తల ఆరోపణ.నియంత్రించలేని మంటల కారణంగా ఆ భవనం కూలిపోయిందని, దానికి సమీపంలో ఉన్న నార్త్ టవర్ ఏడు గంటల పాటు మంటల్లో కాలి కూలిపోయిందని, మంటలు దాని నుంచి టవర్ 7కు అంటుకున్నాయని నివేదికలో తేలింది.