Begin typing your search above and press return to search.
యువ డాక్టర్లకు పెళ్లిళ్ల శాపం.. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతున్నారు
By: Tupaki Desk | 28 March 2021 10:30 AM GMTఆరోగ్యం పాడైనంతనే గుర్తుకు వచ్చే వైద్యుడి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. ఎంతో కష్టపడి చదివితే కానీ సొంతం కాని ఎంబీబీఎస్ పట్టాతో ప్రయోజనం కలుగకపోగా.. కొత్త ఫస్ట్రేషన్ కు కారణమవుతోంది. నెత్తి మీద వయసు పెరిగిపోతున్నా.. జీవితంలో సెటిల్ కాని వైనంతో.. పిల్లను ఇచ్చేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ మాత్రం ఇష్టపడని వైనం ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు ఎంబీబీఎస్ పూర్తిఅయిన వెంటనే.. వారికి వస్తున్న జీతాలు మహా తక్కువగా ఉండటమే కాదు.. జీవితంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.
ఇంజనీరింగ్ తో పాటు.. ఇతర రంగాల్లో చదివిన వారికి కెరీర్ బ్రహ్మాండంగా ఉంటే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారి తిప్పలు మరోలా ఉంటున్నాయి. డిగ్రీతో ఆగిపోతే కెరీర్ లో ముందుకు వెళ్లలేని పరిస్థితి. అలా అని పీజీ చేయాలంటే అందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉండే దుస్థితి. దీనికి కారణం అందులో సీట్ల సంఖ్య తక్కువగా ఉండటమే. దీంతో.. చాలీచాలని జీతాలు.. కెరీర్ లో ముందుకు వెళ్లలేని అవస్థలతో కిందామీదా పడిపోతున్నారు యువ వైద్యులు.
ఎంతో కష్టపడితే కానీ ఇంటర్ నుంచి మెడిసిన్ చదవటానికి సీటు రాని పరిస్థితి. సీటు సొంతం చేసుకున్న తర్వాత.. డిగ్రీలో మంచి మార్కుల కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. తీరా ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వచ్చినంతనే.. ఉద్యోగం చేయాలంటే రూ.15 నుంచి రూ.20 వేలకు మించి జీతాలు రాని దుస్థితి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్కరి చూపు పీజీ మీదనే. కానీ.. అందులో సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉంటుంది.ఒకవేళ.. పీజీ సీటు సాధిస్తే.. దాన్ని పూర్తి చేయటానికి మరింత కష్టపడాల్సిన పరిస్థితి.
పీజీ పూర్తి అయ్యేసరికి అప్పు లక్షల్లో జమ అయ్యే పరిస్థితి. దీంతో.. ఉద్యోగం మీదా.. కెరీర్ లో సెటిల్ అయ్యే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.దీంతో.. 30కి దగ్గర పడుతున్నా పెళ్లి అనే దాని గురించి ఆలోచించలేని పరిస్థితి. ముప్ఫై ఏళ్లకు దగ్గరకు వచ్చినా.. ఆర్థికంగా స్థిరపడని యువ వైద్యునికి పిల్లను ఇచ్చేందుకు ఆడ పిల్లల తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. దీంతో.. వారు తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సంపన్న కుటుంబాల్లోని వారి సంగతి ఫర్లేదు కానీ.. సామాన్య.. మధ్యతరగతి కుటుంబాల్లో మెడిసిన్ చేసిన వారైతే.. అప్పుల సుడిగుండంలో చిక్కి.. దాన్ని తీర్చేందుకే కాలాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. పెళ్లి గురించి ఎవరు మాత్రం ఆలోచించగలరు?