Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో కోర్టు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Feb 2021 4:49 PM GMT
ఓటుకు నోటు కేసులో కోర్టు కీలక నిర్ణయం
X
ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ ప్రక్రియ సాగుతోంది. తాజాగా ఏసీబీ కోర్టు నేడు ఓటుకు నోటు కేసుపై విచారణ చేపట్టింది. ఈ విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు అసలు ఏసీబీ పరిధిలోకి రాదని.. రేవంత్ రెడ్డి హైకోర్టుకు వెళ్తామని కోర్టుకు వెల్లడించారు. దీంతో ఏసీబీ తన తదుపరి విచారణను ఈణెల 16కు వాయిదా వేసింది.

హైకోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేయడం కోసం రేవంత్ రెడ్డి వారం రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలని విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును త్వరగా తేల్చాల్సి ఉందని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈనెల 16వ తారీకు తర్వాత రెండు రోజుల్లో వాదనలు వినిపించడానికి న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ఏసీబీ కోర్టు సూచించింది. 16న నిందితులందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

మంగళవారం ప్రజాప్రతినిధులపై విచారణలో ఎన్నికల కోడ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోర్టుకు హాజరయ్యారు. దీంతో సీతక్కపై నాన్ బెయిలబుల్ వారంట్ ను కోర్టు ఉపసంహరించుకుంది. రూ.10వేల పూచీకత్తు సమర్పించాలని సీతక్కకు కోర్టు ఆదేశించింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.