Begin typing your search above and press return to search.
విడాకుల కోసం కోర్టుకి వెళ్తే ... ఆ తర్వాత ఏమైందంటే
By: Tupaki Desk | 20 Sep 2021 8:01 AM GMTపెళ్లి .. ఈ ప్రపంచంలో పెళ్ళికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పెళ్లిలో వేసే మూడు ముళ్లబంధానికి విలువనిచ్చి భార్య , భర్తలు కలకాలం కలిసి జీవిస్తారు. ఈ సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. ఇక పెళ్లి బంధానికి భారతదేశం లో విశిష్టమైన గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే. ఇద్దరూ కూడా ఎవరికి నచ్చినట్టు వారు జీవించాలని అనుకుంటుండటంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి , ఆ దూరం చివరికి విడాకులకి దారితీస్తుంది. అలాగే కొందరు పక్క దారులు పట్టి కూడా తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కాలంతో పాటు మనుషులు పరుగెడుతున్నారు. ఫలితంగా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పలుసార్లు మనస్పర్థలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్తున్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తుండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని ఒక్కటి చేస్తున్నారు.
మరికొందరు మాత్రం పట్టు విడవకుండా చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏడాది కాలంగా గృహహింస కేసులు పెరిగాయి. ఆనందోత్సాహాలతో అన్యోనంగా కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య క్షణికావేశాలు, భావోద్వేగాల కారణంగా పట్టు, విడుపులు లేని ధోరణి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే గోరంత సమస్యను కొండంతలుగా చేసుకుని విడిపోతున్నారు. పంతాలు, పట్టింపులకు పోయి తానేమీ తక్కువ కాదంటూ రాజీ పడకుండా ఆలోచన శక్తిని కోల్పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారి కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి.
విడాకుల కేసులు దేశంలోని పలు కేసుల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఐతే , తాజాగా ఓ కోర్టు లో విడాకుల కోసం వెళ్లిన జంటకి మళ్లీ పెళ్లి చేశారు. ఈ ఘటన ఒడిశా లో చోటు చేసుకుంది. విడాకుల కోసం వచ్చిన దంపతులకు జయపురం కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మళ్లీ పెళ్లి చేసిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళ్తే, బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హొతా కమతా పంచాయతీకి చెందిన అనితను 2016లో వివాహం చేసుకున్నాడు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు కావాలని కోర్టుకు వెళ్లారు. వారికి అప్పటికే ఏడాది వయసున్న కుమార్తె ఉంది. ఆదివారం ఆ విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు వాదించిన న్యాయవాది మున్నా సింగ్ వివాహబంధం గొప్పతనం వివరించి, వారిని ఒప్పించి మళ్లీ వివాహం జరిపించారు.