Begin typing your search above and press return to search.
పాక్ - బంగ్లాదేశ్ ను రెడ్ లిస్ట్ లో పెట్టిన ఆ దేశం!
By: Tupaki Desk | 2 April 2021 5:30 PM GMTప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న కరీనా మహమ్మారి బ్రిటన్ ను భయపెడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ కారణంగా ఇక్కడ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజువారీ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అలాగే మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్, లండన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మళ్లీ కఠిన నియమాలు అమలు చేసున్నారు. ఇప్పటికే బ్రిటన్ లో పలువురు ప్రముఖులతో పాటుగా ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా భారిన పడి , కోలుకున్న సంగతి తెలిసిందే. అలాగే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా కోలుకున్నారు.
అయితే , ఇతర దేశాల నుండి వస్తున్న వారి నుండి ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని భావించిన ఇంగ్లాండ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ను రెడ్ లిస్టులో చేర్చింది. అసలు రెడ్ లిస్ట్ ఏమిటి అంటే .. రెడ్ లిస్ట్ లో పెట్టిన దేశాల నుండి బ్రిటన్ కి ఇప్పట్లో వెళ్లడం కష్టం. ఈ రెండు దేశాలతో పాటుగా కెన్యా , ఫిలిఫ్ఫిన్స్ దేశాల వారికీ ఏప్రిల్ 9 నుండి తమ దేశంలోకి అనుమతి ఉండదు అని ప్రకటించింది. అయితే , ఆయా దేశాల్లో ఉన్న ఇంగ్లాండ్ , ఐరిషి దేశాలకి చెందిన వారు మాత్రం ఇంగ్లాండ్ లో అనుమతి ఉంటుంది అని తెలిపింది. అయితే , అలా వచ్చిన వారు ఖచ్చితంగా 10 రోజుల పాటుగా ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. కరోనా కొత్త వేరియంట్లు వెలుగులోకి రావడంతో ఇంగ్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.