Begin typing your search above and press return to search.

భారత్ పై ఆ దేశం ఆంక్షలు !

By:  Tupaki Desk   |   19 May 2021 9:30 AM GMT
భారత్ పై ఆ దేశం ఆంక్షలు !
X
ఇండియా లో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు కూడా లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా, ఆస్ట్రేలియా, పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఆ దేశాలు కొన్ని ఆంక్షలతో కూడిన ప్రయాణాలకి అనుమతి ఇచ్చింది.

ఇదిలా ఉంటే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న తరుణంలో భార‌త్‌ పై ఆంక్ష‌లు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది. ఇండియా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై సూడాన్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. రెండు వారాల‌ పాటు ఆ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయని వెల్ల‌డించింది. అదే విధంగా ఆఫ్రికాలో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న ఈజిప్ట్‌, ఇథియోపియా దేశాల ప్ర‌యాణికుల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపివారి. వారంద‌రికి మరోసారి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్న‌ది. వైద్యరంగంలో సౌక‌ర్యాలు అంతంత మాత్రంగానే సూడాన్ క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ది. ఈనేప‌థ్యంలో దేశంలోని స్కూళ్లు, యూనివ‌ర్సిటీల‌ను మూసివేసింది. ప్రార్థ‌న‌ల‌ తో పాటు బ‌హిరంగంగా గుమికూడ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఇప్ప‌టికే ల‌క్ష మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు.