Begin typing your search above and press return to search.

కరోనా మరణాల రేటులో అగ్రస్థానం ఆ దేశందేనట !

By:  Tupaki Desk   |   10 Sep 2020 11:30 PM GMT
కరోనా మరణాల రేటులో అగ్రస్థానం ఆ దేశందేనట !
X
కరోనా మహమ్మారి .. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. గత ఏడాది చివర్లో చైనా లో మొదలైన ఈ వైరస్ , ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఎంతలా అంటే కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం కొన్ని రోజులు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అగ్రదేశంగా చెప్పుకునే అమెరికాకూడా కరోనా దెబ్బకి వణికిపోయింది. అభివృద్ధి చెందిన అమెరికా కూడా కరోనా ను అరికట్టడంలో పూర్తిగా విఫలం అయింది. ఇప్పుడిప్పుడే అమెరికాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక మన దేశంలో రోజురోజుకి కరోనా కేసులు , కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 28,026,967 మంది కరోనా భారిన పడ్డారు. అలాగే , 908,002 మంది మరణించారు.

కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో టాప్ లో ఉన్నాయి. కానీ కరోనా వల్ల మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశం మాత్రం ఇవేవీ కావు. అత్యధిక మరణాల రేటు జాబితాలో దక్షిణ అమెరికాలో తూర్పు సముద్ర తీరంలో ఉన్న పెరూ అన్నిటికంటే టాప్‌లో ఉంది. జాన్స్ హాప్‌ కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పెరూలో మరణాల రేటు 93.71. దీన్నిబట్టి చూస్తే ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 94 మంది చనిపోతున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో మొట్ట మొదటి కోరనా కేసు బ్రెజిల్‌ లో నమోదైంది. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకూ ఈ వైరస్ వల్ల లక్షా 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక , కరోనాకు మరో పుట్టినిల్లు అయిన అమెరికాలో మృతుల సంఖ్య కొన్ని వారాల్లో రెండు లక్షలకు చేరుకోనుంది.