Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల ఖర్చు లెక్క తెలిస్తే నోట మాట రాదంతే
By: Tupaki Desk | 29 Oct 2020 5:30 PM GMTప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్ష ఎన్నిక అంటే మాటలు కాదు. సర్పంచ్ ఎన్నిక కోసమే కోట్లాది రూపాయిలు ఖర్చు పెడుతున్న వేళలో.. ప్రపంచానికే పెద్దన్న పదవిని సొంతం చేసుకునేందుకు ఎన్నికల బరిలో చేసే ఖర్చు ఎంత ఉండాలి? మన దగ్గర పెట్టే ఖర్చు బ్లాక్.. వైట్ లాంటి లెక్కలు ఉంటాయి. అమెరికాలో బ్లాక్ మాట వినిపించదు. అంతా వైటే. ఖర్చు లెక్క ఎప్పటికప్పుడు ఓపెన్ గా వెల్లడిస్తుంటారు. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో. .చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు లేనంత భారీగా ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటివరకు దాదాపుగా 14 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని రూపాయిల్లోకి మారిస్తే ఎంత వస్తుందో తెలుసా? అక్షరాల రూ.1.03లక్షల కోట్లుగా చెప్పొచ్చు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ రిపోర్టు అంచనా వేసింది. గతంలో జరిగిన ఏ అధ్యక్ష ఎన్నికకు ఇంత భారీగా ఖర్చుకాలేదని చెబుతున్నారు.
2012లోనూ.. 2016లోనూ జరిగిన ఎన్నికల మొత్తం ఖర్చు కూడా ఇంత భారీగా ఉండలేదంటున్నారు. వాస్తవానికి ఈసారి ఎన్నికల ఖర్చు రూ.81 వేల కోట్ల రూపాయిలకు మించదని అంచనా వేశారు. అయితే.. ట్రంప్ వర్సెస్ బెడైన్ మధ్య పోటీ రసవత్తరంగా సాగటం.. ఉభయ పక్షాలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎన్నికల ఖర్చు వరదను తలపించింది. కరోనా వేళ జరుగుతున్న అధ్యక్ష ఎన్నిక ప్రధాన భూమిక పోషిస్తోంది. మరి ఖర్చు చేసిన 1.03లక్షల కోట్ల విషయానికి వస్తే.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బెడైన్ కు ఫండ్స్ ద్వారా రూ.7400 కోట్లు వస్తే.. ఆయన గెలుపు కోసం బిలియనీర్లు అండగా నిలిచారు.
న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్ బర్గ్.. ఎన్ జీవో టామ్ ఇద్దరు భారీగా ఖర్చు చేశారు. వీరి ఖర్చు దగ్గర దగ్గర రూ.10వేల కోట్ల వరకు ఉండటం గమనార్హం.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరిద్దరు తొలుత డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నించిన వారే కావటం గమనార్హం. జో బెడైన్ కు ధీటుగా రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ సైతం భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఫండ్ రైజింగ్ ద్వారా రూ.4,415 కోట్లు వసూలు చేసింది. ఎన్నికల ప్రచారానికి రిపబ్లికన్ పార్టీ రూ.28వేల కోట్లకు పైనే ఖర్చు చేసినట్లుగా లెక్క కట్టారు. మరో కీలక అంశం ఏమంటే.. ట్రంప్ తో పోలిస్తే జో బెడైన్ కు మహిళలు ఎక్కువగా విరాళాలు ఇవ్వటం గమనార్హం.