Begin typing your search above and press return to search.

కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎంత?

By:  Tupaki Desk   |   21 Dec 2016 4:34 AM GMT
కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎంత?
X
పాత పెద్ద నోట్లను రద్దు చేశారు.. వాటిస్థానే కొత్త నోట్లను తీసుకువచ్చారు. ఇది చిన్న నిర్ణయం కాదు, 120 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో రీప్లేస్ మెంట్ అనేది చిన్న పని కాదు. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అంటే... నల్లధనాన్ని అరికట్టడానికని, నగదు రహిత సమాజం కోసమని అనంతరం లెస్ క్యాష్ సొసైటీ కోసమని రకరకాల స్టేట్ మెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే ఇంతకూ పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను ముద్రించడానికి ఏస్థాయిలో ఖర్చవుతుంది అనే అనుమానం ఒక వ్యక్తికి వచ్చింది. అంతే... ఉన్నఫలంగా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.. సమాచార హక్కు చట్టానికి పని చెప్పాడు. దీంతో నోట్ల ప్రింటింగ్ ఖర్చు వివరాలు వెలుగులోకి వచ్చాయి.

నీముచ్ కి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ప్రశ్నించాడు! కొత్త ముద్రిస్తున్న ఒక్కో రూ. 500 నోటుకి - రూ. 2000 నోటుకు ప్రింటింగ్ ఖర్చు ఎంతవుతుందని అడిగాడు. దీనిపై స్పందించిన భారతీయ రిజర్వు బ్యాంకు నోట్‌ ముద్రణ్‌ ప్రైయివేట్‌ లిమిటెడ్‌ (బీ.ఆర్‌.బీ.ఎన్‌.ఎం.పీ.ఎల్‌) చంద్రశేఖర్ కి సమాధానాలు పంపింది. ఈ లెక్కల ప్రకారం ఆర్బీఐ ఒక్కో కొత్త రూ. 500 నోటు ముద్రణకు రూ. 3.09 - రూ. 2000 నోటుకోసం రూ. 3.54 చొప్పున ఖర్చుచేస్తున్నట్లు వెల్లడైంది. కొత్త - పాత రూ.500 నోటుకు సమానంగా వ్యయమవుతోందని, పాత రూ.1000 నోటు ముద్రణకయ్యే మొత్తాన్నే కొత్త రూ.2000 నోటుకు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/