Begin typing your search above and press return to search.
కరోనా మృతుల కుటుంబాలకి భారంగా అంత్యక్రియల ఖర్చు!
By: Tupaki Desk | 23 July 2020 12:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి దేశంలో రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతూ .. విలయతాండవం చేస్తుంది. కరోనా భారిన పడి మరణించేవారి సంఖ్య ఈ మధ్య భారీగా పెరుగుతుంది. అయితే , కరోనాతో కుటుంబ సభ్యుడు చనిపోయిన బాధలో ఉన్న వారికీ, అంత్యక్రియలు చేయడానికి తలకుమించిన భారంగా మారుతుంది. కరోనాతో మరణిస్తే .. వారికీ అంత్యక్రియలు నిర్వహించడానికి దళారులు వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇలా కరోనా మరణాలను కూడా తమకి అనుకూలంగా మార్చుకొని లక్షలు వెనుకేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఒక్కో కరోనా శవానికి అంత్యక్రియలు చేయడానికి రూ.25 వేల డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ మద్యే అవినీతి వ్యతిరేక ఫోరం ఉపాధ్యక్షుడు సాయి తేజ .. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న ఫ్యామిలీకి అంత్యక్రియలు చేయడంలో సాయం చేసారు. ఒకే కుటుంబంలో ఇద్దరు కరోనాతో మృతి చెందగా .. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించదానికి ఆ సిబ్బంది రూ.50 వేలు వసూలు చేశారని ఆయన వెల్లడించారు. వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందొ ఏమో అన్న సంగతి పట్టించుకోకుండా వేలు డిమాండ్ చేస్తుండటం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒకరికి దహనసంస్కారాలు చేయడానికి కట్టెలు, ఇంధనం, దహన సంస్కారాలను పూర్తి చేసే వ్యక్తికి ఇచ్చే మొత్తం.. ఇలా అన్నీ కలిసినా రూ.10 వేలకు మించదని తేజ తెలిపారు.
అంత్యక్రియలు పూర్తి చేయడానికి కట్టెలు, ఇంధనం సమకూరిస్తే.. రూ.500కే దహన సంస్కారాలు నిర్వహిస్తామని శ్మశానంలో బోర్డు కూడా ఉంది. వారే అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తే.. ఎక్కువ మొత్తం వసూలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సొంత ఖర్చులతో మృతదేహాన్ని తీసుకొచ్చినా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని తేజ తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించినందుకు డబ్బులు తీసుకొని రశీదు కూడా ఇవ్వడం లేదని చాలా మంది చెబుతున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన విధంగా స్పందించలేదు అని , వారు ఇప్పటికైన సరైన విధంగా స్పందించి ..భాదితులకు అండగా నిలబడాలని కోరారు.