Begin typing your search above and press return to search.
మే 5 తర్వాత కరోనా సహజ స్వభావాన్ని కోల్పోతుందట !
By: Tupaki Desk | 21 April 2021 6:30 AM GMTకరోనా సెకండ్ వేవ్ .. భారత్ లో కరోనా మరోసారి బీభత్సం సృష్టిస్తుంది. దీనితో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా ను కంట్రోల్ చేయలేక లాక్ డౌన్ వైపు సాగుతున్నాయి. రోజు రోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేశ ప్రజానికానికి అభయం ఇచ్చారు. ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుభవార్త చెప్పారు. ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కరోనాతో మన దేశానికి అంతగా చేటు జరగదని అన్నారు.
కరోనా వైరస్ గురించి నైరాశ్యం వద్దు. మన దేశం ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసిందని స్వామీజీ అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో దాని ప్రభావం తగ్గుతుందని స్వామీ చెప్పారు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని, కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే ప్రజల్ని కాపాడుతోంది. అదే రక్షణ. లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. భారత్ కి ఏమీ ప్రమాదం లేదు అని , హిమాలయాలతో కూడుకున్న నదులు , తీర్థములు , పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్న భారత్ కి ఏమీ కాదు అని అన్నారు.