Begin typing your search above and press return to search.
వచ్చేవారమే కాంగ్రెస్ అధ్యక్షుడెవరో తేలేది
By: Tupaki Desk | 23 Aug 2020 3:30 AM GMTవృద్ధాప్యంతో సోనియా గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు బరువు అవుతున్నాయి. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో అధ్యక్ష పదవిని త్యజించాడు. దీంతో పార్టీని నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ అధిష్టానం వేట మొదలుపెట్టింది. కాంగ్రెస్ లో నాయకత్వ సంక్షోభానికి తెరదించే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది.
వచ్చేవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో అధ్యక్ష ఎన్నికలపై పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే గాంధీ కుటుంబేతరులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. దీంతో ఎవరిని చేస్తారనేది ఆసక్తిగా మారింది.
తాజాగా 100మందికి పైగా కాంగ్రెస్ నేతలు నాయకత్వ సమస్య తీర్చాలంటూ సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో సోనియా దేశంలో కాంగ్రెస్ ను చక్కదిద్దాలని కంకణం కట్టుకున్నారు.
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు సిద్ధంగా లేదరు. గాంధీ కుటుంబ నాయకత్వం రేసులో లేదని ప్రియాంక గాంధీ తేల్చేసింది. అందుకే వచ్చేవారం సీడబ్ల్యూసీ భేటి ఏర్పాటు చేసి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీ సీనియర్ల అభిప్రాయాల ప్రకారం పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారినే ఎంపిక చేసే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రతీసారి కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితో చెక్ చెప్పాలని సోనియా కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం.