Begin typing your search above and press return to search.
ఇందిరా గాంధీ ఓకే అంటే ఎన్టీయార్ ఢిల్లీలోనే...?
By: Tupaki Desk | 28 May 2023 6:00 PM GMTఎన్టీయార్ రాజకీయ ప్రవేశం మీద ఎన్నో కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన్ని దేశంలోని కాంగ్రెస్ పాలకు లు మహానటుడిగా గుర్తించడానికి కూడా ఆలోచించిన పరిస్థితులు ఉండేవి. 1968లో పద్మశ్రీ పురస్కారం మొదట అక్కినేనికి వచ్చినట్లుగా ప్రచారం సాగింది. దాంతో ఎన్టీయార్ ఆగ్రహం చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని వెండితెర వేలుపుని అవమానించడం తగదని కేంద్ర పెద్దల కు సర్ది చెప్పారు. అలా పద్మశ్రీ పురస్కారం అక్కినేని తో పాటు ఎన్టీయార్ సొంతం అయింది.
ఎన్టీయార్ కి కాంగ్రెస్ నేతలతో మంచి రిలేషన్స్ ఉండేవని చెబుతారు. ఆయన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి తో మంచి దోస్తీ ని నెరిపేవారు. ఆయన అడిగారని రాయలసీమ కరవు నిధికి తోటి సినీ నటులతో కలసి విరాళాలు పోగు చేసి అందించారు. చివరి దాకా విజయభాస్కర రెడ్డి తో ఎన్టీయార్ స్నేహం సాగింది.
ఎన్టీయార్ సినీ రంగం చెన్నై లో ఉండడం చేత అక్కడే ఉండిపోయారు షూటింగుల తో అక్కడే గడిపేవారు. ఇక ఎనభై దశకంలో తన తోటి తమిళ నటుడు శివాజీ గణేషన్ కి రాజ్యసభ సీటుని కాంగ్రెస్ ఆఫర్ చేసి ఆయన్ని నామినేట్ చేసింది. అప్పటిదాకా పదవీ రాజకీయాల మీద అన్న గారికి ఏమీ మోజు లేదు. అయితే ఆయన అనుచరులు, ఆయన సన్నిహితులు మాత్రం ఎన్టీయార్ కి ఏమి తక్కువ అంటూ వచ్చారు.
తెలుగు నాడు కు సంబంధించి చూస్తే ఎన్టీయార్ కి రాజ్యసభ ఇచ్చి నామినేట్ చేసేందుకు చాన్స్ ఉందని కానీ తెలుగు వారి పట్ల కాంగ్రెస్ చిన్న చూపు చూడడం వల్లనే అది జరగలేదు అంటూ ఉండేవారు. ఆ భావనలు అన్నీ ఎన్టీయార్ లో కొత్త ఆలోచనలు వచ్చాయి. తెలుగు వారిని అవమానం చేస్తూ వారిని ఏమీ కాకుండా చూస్తూ వస్తున్న కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెప్పాలని ఆనాడే ఎన్టీయార్ డి సైడ్ అయ్యారు.
ఆయన సరైన సమయం చూసుకుని మరీ 1982లో పార్టీ పెట్టి తెలుగు నాట కాంగ్రెస్ వెన్ను విరిచారు. అప్పటిదాకా మద్రాసీలు గా చెప్పుకుంటూ తెలుగు వారి అస్థిత్వం ఏమీ లేకుండా కాకుండా పోతున్న దశలో ఆయన తెలుగుదేశం పేరుతో ఢిల్లీ పీఠాన్ని అక్కడి పెద్దల ను కూడా కదిలించారు. తెలుగు పౌరుషం ఎంతటి దావానలాన్ని రగిలిస్తుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
తెలుగు వారి కోసం పోరాడిన వారు ఎందరో ఉన్నారు. కానీ తెలుగు ఆంత గౌరవం కోసం తపన పడి ఢిల్లీ పెద్దల ను ఎదిరించి తెలుగు వాడి గొప్పతనం చాటిన ఘనత మాత్రం అచ్చంగా ఎన్టీయార్ దే అని చెప్పాలి. ఇక్కడ మరో సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎన్టీయార్ కి ఆనాడే రాజ్యసభ సీటు కాంగ్రెస్ ఆఫర్ చేసి ఉంటే ఆయన పార్టీ పెట్టేవారా అని. ఆయన ఢిల్లీకే పరిమితం అయి పార్లమెంట్ లో ఒక మెంబర్ గా ఉండేవారు కదా అని.
అయితే ఎన్టీయార్ మనస్తత్వం కానీ ఆయన ఆత్మ విశ్వాసం కానీ ఆత్మ గౌరవం కానీ దగ్గరుండి చూసిన వారు ఎవరూ ఆయన ఏనాడూ రాజీపడే మనిషి కారని అంటారు. అందుకే ఆయన తన బిరుదులు చూసుకోలేదు, పదవుల కోసం వెంపల్రాడలేదు. ఢిల్లీ కి తెలుగు దెబ్బ చూపించారనుకున్నారు. అలా తడాఖా చూపించి తెలుగు వారేంటో ప్రపంచానికే చాటారు. ఇంతటి మహత్కార్యం చేసినందు కు గానూ ఆయనకు తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.