Begin typing your search above and press return to search.

వక్ఫ్ భూమిని కాజేసిన ‘ఈనాడు’.. కలెక్టర్ కు ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   7 Oct 2019 6:49 AM GMT
వక్ఫ్ భూమిని కాజేసిన ‘ఈనాడు’.. కలెక్టర్ కు ఫిర్యాదు!
X
‘ఈనాడు దినపత్రిక’ తమ భూమిని కబ్జా చేసిందని బాధితులు కలెక్టర్ తోపాటు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.. కర్నూలు జిల్లా మునగాలపాడు సర్వేనంబర్ 80లోని 4.68 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని ఈనాడు పత్రిక యజమాన్యం కబ్జా చేసిందని కర్నూలు జిల్లాకు చెందిన సున్నీ జామియా మసీద్ సంఘం ముత్తవల్లి సయ్యద్ పాషావలి సహెబ్, పలువురు సంఘం సభ్యులు ప్రభుత్వం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

తమ వక్ఫ్ బూమిని కబ్జా చేసిందే కాక.. ప్రశ్నించినందుకు రెండేళ్లుగా పదుల సంఖ్యలో కేసులు పెట్టి తమను వేధిస్తోందని సయ్యద్ పాషావలి సహెబ్ కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇక ఆదివారం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ను కూడా కలిసి ఈ విషయంపై న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. మునగాలపాడు సమీపంలోని జాతీయ రహదారి 44 పక్కనున్న 4.68 ఎకరాల భూమి వందల ఏళ్ల నుంచి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందన్నారు. టీడీపీ 2015లో అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ అండతో ‘ఈనాడు’ యాజమాన్యం కబ్జా చేసిందని ఆరోపించారు. ఈనాడులో పనిచేసే రతన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ఆ భూమి 1బీ, ఆర్ఓఆర్ వక్ఫ్ బోర్డు పేరుమీదనే ఉందన్నారు. కేసును కోర్టుల్లో వేసి తమను వేధిస్తున్నారని బాధితులు వాపోయారు.