Begin typing your search above and press return to search.
ఏకే 203.. భారత ఆర్మీకి కొండంత బలం
By: Tupaki Desk | 2 Sep 2020 2:30 PM GMTరష్యా తయారు చేసి పవర్ ఫుల్ గన్ ‘ఏకే 47’ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ గన్. దీంతో క్షణాల్లోనే వందలాది మందిని చంపొచ్చు. అయితే ఏకే 47తో పోలిస్తే రష్యా అభివృద్ధి చేసిన ఏకే 203 లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందింది. దీని సామర్థ్యం కూడా ఎక్కువే.
ఏకే 47లాగే ఏకే 203లో కూడా సేమ్ బుల్లెట్స్ ఉంటాయి. అయితే షూటర్ తన ఎత్తుకు తగినట్టుగా ఫైరింగ్ మోడ్ ను సరిచేసుకునే అవకాశం కొత్త వెపన్లో ఉంది. రాత్రివేళ వినియోగానికి వీలుగా ఏకే 203లో ఫ్లాష్ సౌకర్యం కూడా అమర్చారు.
ప్రస్తుతం మన భారత ఆర్మీ 1999 నుంచి వినియోగిస్తున్న ఇన్సాస్ తుపాకలు స్థానంలో ఏకే 203 రైఫిల్స్ ను వాడాలని కేంద్రం నిర్ణయించింది. రానున్న కాలంలో సైన్యానికి ప్రధాన ఆయుధంగా ఏకే 203ను తీర్చిదిద్దాలని రష్యాతో ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసింది.
ఏకే 203 తుపాకులను దేశీయంగానే తయారు చేయనున్నారు.ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది. త్వరలోనే 6 లక్షల ఏకే 203 గన్స్ ను ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇది మన భారత ఆర్మీకి కొండంత బలంగా మారనుంది.