Begin typing your search above and press return to search.

మునుగోడులో అల్లుళ్ల సందడి.. వీఐపీ బంధువుల హంగామా

By:  Tupaki Desk   |   15 Oct 2022 4:30 PM GMT
మునుగోడులో అల్లుళ్ల సందడి.. వీఐపీ బంధువుల హంగామా
X
రాజకీయంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మునుగోడు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు కమలం పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకొనేందుకు కాంగ్రెస్.. క్రితం సారి 90 శాతం సీట్లు గెలిచిన తమకు చేజారిన ఆ పదిశాతంలో ఒకటైన మునుగోడును దక్కించుకుని సత్తా చాటాలని టీఆర్ఎస్ ఇలా దేనికదే ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మునుగోడులో సందడి అంతా ఇంతా కాదు. దీంతోపాటు అల్లుళ్ల సందడి నెలకొనడమే విశేషం.

అందుకే హడావుడి మునుగోడు హైదరాబాద్ కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడివారు ఎక్కువగా హైదరాబాద్ వచ్చి స్థిరపడుతుంటారు. లేదా ఉపాధిని వెదుక్కుంటారు. యువత, విద్యార్థులు చదువు కోసం నగరానికి వస్తుంటారు. ఇక మన రాజకీయ నాయకులకూ మునుగోడు నియోజకవర్గంలో బంధు గణం తక్కువేమీ లేదు.

వీరిలో ఎక్కువమంది నియోజకవర్గంలోని గ్రామాలకు అల్లుళ్లు కావడమే విశేషం. ఉప ఎన్నిక నేపథ్యంలో వీరంతా అక్కడే మకాం వేశారు. సహజంగానే అల్లుళ్లు వస్తే హడావుడి ఉంటుంది. ఇప్పుడు ఉప ఎన్నిక నడుమ వస్తే ఆ సందడి ఇంకా అధికంగా ఉంటుందనడంలో సందేహం ఏముంది?

అక్కడినుంచే ప్రచార బాధ్యతలు ఉప ఎన్నిక సందర్భంగా అత్తగారి ఊళ్లకు వెళ్లిన అల్లుళ్లు అక్కడినుంచే ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కొందర బంధువుల ఇళ్ల నుంచి పర్యవేక్షణ సాగిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

జగదీశ్ రెడ్డి అత్తగారి ఊరు మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామం. ఆయనకు టీఆర్ఎస్ నాయకుడు భవనం శ్రీనివాస్ రెడ్డి వరుసకు సోదరుడు అవుతారు. ఈయన ఇప్పర్తిలోనే ఉంటున్నారు. జగదీశ్ రెడ్డి సతీమణి ముగ్గరు అక్కాచెల్లెళ్లలో అందరి అత్తగారిళ్లు మునుగోడులోనే ఉండడం విశేషం. ఇక రేవంత్ అత్తగారి చెల్లెలిది మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామం. రేవంత్ భార్య అమ్మమ్మది ఇదే మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామం. దీంతో ఆయనను కొంపల్లి అల్లుడిగానే స్థానికులు భావిస్తున్నారు.

ఈటలకు, బాల్క సుమన్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ది కులాంతర వివాహం. ఆయన భార్య జమున రెడ్డి కాగా, ఈటల ముదిరాజ్. జమునది మునుగోడు మండలంలోని పలివెల గ్రామం. మంత్రి హోదాలో ఉండగా పలుసార్లు ఆయన ఈ గ్రామానికి వచ్చారు. బాల్క సుమన్ ది కూడా కులాంతర వివాహమే. ఆయన భార్యది చండూరు మండల కేంద్రం. ఈ స్థానానికే సుమన్ కు ఇన్ చార్జిగా చేశారు. కాగా, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు క్రిష్ణారెడ్డి అత్తగారి ఊరు చండూరు మండలంలోని నెర్మెట గ్రామం. భూపాల్ రెడ్డి సోదరిని మర్రిగూడెం మండంలోని కొండూరు గ్రామ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె సర్పంచ్ గా ఉన్నారు. మరో సోదరి ఇదే మండలంలోని శివన్నగూడెం సర్పంచ్ కావడం గమనార్హం. భూపాల్ రెడ్డి ఇప్పడు బంధువుల ఇళ్ల నుంచే ప్రచారం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.