Begin typing your search above and press return to search.
బోర్నవిటాకు జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ ఆదేశాలు తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 27 April 2023 11:00 PM GMTబోర్నవిటా ఎపిసోడ్ అనూహ్య ములుపు తిరిగింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కొత్త సందేహాలకు తెర తీసేలా మారటం గమనార్హం. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) ఆదేశాలు మరో చర్చకు తెర తీసేలా ఉన్నాయని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే.
కొద్దిరోజుల క్రితం ఒక నెటిజన్ క్యాడబరీస్ కు చెందిన బోర్నవిటా ఉత్పత్తి పై ఒక వీడియోను చేయటం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పోస్టు చేసిన ఈ చిట్టి వీడియో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. బోర్నవిటాలో చెక్కర అధికంగా ఉందని.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్యాకింగ్ లేబుల్ ఉందని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. సామాన్యులే కాదు ప్రముఖులు సైతం ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.
స్వల్ప వ్యవధిలోఈ వీడియోను 1.2 కోట్ల మంది దీన్ని వీక్షించారు. పిల్లల ఎదుగుదలలో తమ ఉత్పత్తి కీలకంగా ఉంటుందన్న భావన వచ్చేలా ప్యాకేజీ లేబుల్ ఉండటాన్ని ప్రశ్నించటంతో పాటు..చక్కెర శాతం ఎక్కువన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ఈ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో.. దాని ఎఫెక్టు సంస్థ మీద పడింది. దీంతో బోర్నవీటా బ్రాండ్ ను ఉత్పత్తి చేసే మాండెలెజ్ ఇండియా స్పందించింది. సదరు వీడియో చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వీడియో పోస్టు చేసిన వ్యక్తి .. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం నుంచి డిలీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ అంశం మీద జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కు ఫిర్యాదు అందింది. తమకు అందిన ఫిర్యాదులో పిల్లల ఆరోగ్యానికి హాని చేసే చక్కెర శాతం.. ఇతర పదార్థాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపిందే. ఈ సందర్భంగా ఎన్ సీపీసీఆర్ సరికొత్త ఆదేశాల్ని జారీ చేసింది.
"మీ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టేలా ప్యాకేజ్.. యాడ్స్ చేస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. లేబులింగ్.. ప్యాకేజింగ్ డిస్ ప్లే.. వ్యాపార ప్రకటనలు సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆరోపణల పై పూర్తి స్థాయిలో వివరణ లేదంటే నివేదికను మాకు సమర్పించండి" అని నోటీసులు జారీ చేశారు.
బోర్నవిటాలో ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఇవ్వటంలో కంపెనీ ఫెయిల్ అయ్యిందన్నవాదన పై తమకు వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీని పై సదరు బ్రాండ్ ను ఉత్పత్తి చేసే కంపెనీ స్పందిస్తూ.. ఆహార శాస్త్రవేత్తల టీం శాస్త్రీయంగా తమ ఉత్పత్తిని ఫార్ములేషన్ చేసిందని..తనిఖీలు జరిగాయని.. అనుమతులు వచ్చాయని పేర్కొంది. పాకెట్ మీద అవసరమైన సమాచారాన్ని తాము ఇచ్చినట్లుగా గతంలో పేర్కొనటం తెలిసిందే. తాజా పరిణామాల పై కంపెనీ ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.