Begin typing your search above and press return to search.
షాకింగ్.. మిస్సయిన విమానం 35 ఏళ్లకు ల్యాండింగ్.. అందులో అన్నీ అస్థి పంజరాలే
By: Tupaki Desk | 1 Dec 2020 11:30 PM GMTబాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా చూశారా.. అందులో హీరో, హీరోయిన్లు టైం మెషిన్ లోకి ఎక్కి ఒక కాలంలో నుంచి మరో కాలానికి ప్రయాణిస్తారు. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఒక కాలం నుంచి మరొక కాలానికి వెళ్లడంపై ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడు అచ్చు అలాగే నిజ జీవితంలోనూ ఓ ఘటన జరిగింది. 1954లో జర్మనీలో బయలుదేరిన శాంటియాగో ఫ్లైట్ (513) 35 ఏళ్ల తర్వాత బ్రెజిల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
అయితే ఈ విమానంలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. అన్ని సీట్లలోనూ అస్థి పంజరాలు మాత్రమే ఉన్నాయి. పైలెట్ సీట్లో కెప్టెన్ మిగ్యుల్ విక్టర్ అస్థి పంజరం కనిపించింది. 88 మంది ప్రయాణికులు సహా నలుగురు విమాన సిబ్బంది శవాలై కనిపించారు. అయితే ఈ విమానం టైం మెషిన్ లా ఒక కాలం నుంచి మరొక కాలానికి ప్రయాణించి వచ్చిందని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఈ విషయం ఇటీవల మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో దీని గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇంత ఆసక్తి రేపుతున్న ఈ ఘటన వెనక ఉన్న విశేషాలు ఏంటంటే..
1989 నవంబర్ 14న వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక ఒక సంచలన వార్తను ప్రచురించింది. 35 ఏళ్ల కిందట మిస్సయిన విమానం( 513 ) అక్టోబర్ 12, 1989 లో బ్రెజిల్లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఆ విమానంలో 92 అస్థిపంజరాలు ఉన్నాయని ఆ కథనంలో పేర్కొంది. రికార్డ్ ల ప్రకారం 1954 సెప్టెంబర్ 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి ఆ ఫ్లైట్ టేకాఫ్ అయినట్లు ఉంది.
అయితే ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. అయితే ఈ విమానం మళ్లీ 35 ఏళ్ల తర్వాత 1989లో ల్యాండ్ అయింది. అయితే విమానం టైం మిషన్ లాగా ఒక కాలం నుంచి మరొక కాలం లోకి వెళ్లి ఉంటుందని పలువురు పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పరానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్ సో అటెల్లో స్పందిస్తూ ఆ విమానం తప్పకుండా టైం ట్రావెల్ చేసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఘటన గురించి జర్మనీ ప్రభుత్వం కూడా తమ ఏజెంట్ల ద్వారా విచారణ చేసిందని, అయితే ఆ విషయాలు వెల్లడించేందుకు నిరాకరించారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. 1989 లో ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైనదని, దానికి పాతకాలంనాటి టర్బో ప్రాప్ ఇంజన్లు కూడా ఉన్నాయని, విమానంలో అన్నీ శవాలే ఉన్నా క్రాష్ ల్యాండింగ్ అవలేదని విమానాశ్రయ సిబ్బంది చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.
35 ఏళ్ల తర్వాత ల్యాండ్ అయిన విమానంలో పైలెట్లు సహా ప్రయాణికులందరూ అస్థిపంజరాల్లాగా మిగిలి ఉంటే అదెలా ల్యాండ్ అయ్యింది. దానికి అనుమతులు ఎవరిచ్చారు. ఒక బతికున్న మనిషి కూడా లేని విమానం అంత కరెక్ట్ గా ఎలా ల్యాండ్ అయింది.. అని పలు సందేహాలు అందరిలో తలెత్తుతున్నాయి.
కొందరు ఈ ఘటనపై విమానం కచ్చితంగా టైం ట్రావెల్ చేసిందని నమ్ముతున్నారు. అయితే ఇదంతా ఫేక్ డ్రామా అని మరి కొందరు కొట్టిపారేస్తున్నారు. అస్థి పంజరాలు ఉన్న ఓ విమానం ల్యాండ్ కావడం ఏమిటి.. అని ప్రశ్నిస్తున్నారు. 1954లో మిస్ అయిన విమానం కూలిపోగా.. అదెక్కడ కూలిపోయింది.. ఎంత మంది చనిపోయారు.. అనే విషయాలను జర్మనీ ప్రభుత్వం తెలియజేయలేదు. అయితే కొన్నేళ్ళ తర్వాత ఆ విమానం ఎక్కడ కూలింది.. అనే విషయం తెలిసినా ఆ అంశం వివాదాస్పదంగా మారే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఇక ఆ ప్రస్తావన తెచ్చి ఉండకపోవచ్చని కొందరు చెబుతున్నారు. కేవలం సంచలనం కోసమే వీక్లీ వరల్డ్ న్యూస్ పత్రిక ఫేక్ న్యూస్ ప్రచురించిందని వాదిస్తున్నారు. ఏదిఏమైనా 35 ఏళ్ళ కిందటి న్యూస్ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది.