Begin typing your search above and press return to search.
హత్రాస్ యువతిపై రేప్ జరగలేదు - ఆ కుటుంబాన్ని బెదిరించిన కలెక్టర్ - వీడియో వైరల్!
By: Tupaki Desk | 2 Oct 2020 10:31 AM GMTయూపీ, హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక అత్యాచారం జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. కానీ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఈ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టమవుతోందని.. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదిలా ఉండగా .. హత్రస్ బాధిత కుటుంబాన్ని స్వయంగా కలెక్టర్ బెదిరించారంటూ వీడియో వైరల్ అవుతోంది. ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మార్చుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు నేషనల్ మీడియా ఛానల్స్ కూడా విషయంపై కథనాలను ప్రసారం చేశాయి. ఇప్పుడు హడావుడి చేస్తున్న మీడియా ప్రతినిధుల్లో సగం మంది నేడు, మిగతా సగం రేపు వెళ్లిపోతారని, ఆ తర్వాత ఇక్కడ ఉండేది తామేనని, కాబట్టి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) ప్రవీణ్ కుమార్ లక్సర్ బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోపై స్పందించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను మీడియా కోరగా, ఎటువంటి స్పందన లేకుండా మౌనం వహించారు.
ఇక, హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డేను, కొలీజియం న్యాయమూర్తులను కోరారు