Begin typing your search above and press return to search.

కోర్టును ధిక్క‌రించిన క‌లెక్ట‌ర్‌ మీరెప్పుడూ వినని శిక్ష!

By:  Tupaki Desk   |   8 April 2021 2:30 AM GMT
కోర్టును ధిక్క‌రించిన క‌లెక్ట‌ర్‌ మీరెప్పుడూ వినని శిక్ష!
X
త‌ప్పు చేసిన వారికి కోర్టులు ఎలాంటి శిక్ష‌లు వేస్తాయో.. అంద‌రికీ కొంత అవ‌గాహ‌న ఉంటుంది. కానీ.. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రిస్తే ఎలాంటి శిక్ష‌లు విధిస్తాయో మాత్రం చాలా మందికి తెలియ‌దు. ధిక్క‌ర‌ణ తీవ్ర‌త‌ను బ‌ట్టి శిక్ష‌ల‌ను ఖ‌రారు ‌చేస్తుంది న్యాయ‌స్థానం. తాజాగా.. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో న‌ల్గొండ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ కు అరుదైన శిక్ష విధించిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌తీ వారంలో రెండు గంట‌ల‌పాటు అనాథాశ్ర‌మంలో గ‌డ‌పాల‌ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఆరు నెలల‌‌పాటు కొన‌సాగించాల‌ని కోర్టు ఆదేశాలు జారీచేసిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇదే కేసులో ఉన్న మ‌రో మ‌హిళా అధికారి సంధ్యారాణికి సైతం ఇదే త‌ర‌హా శిక్ష విధించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

రాబోయే ఉగాది, శ్రీరామ‌న‌వ‌మి పండుగ‌ల సంద‌ర్భంగా.. హైద‌రాబాద్ లోని అనాథాశ్ర‌మాల్లో భోజ‌నం పెట్టాల‌ని ఆదేశించింద‌ని స‌మాచారం. త‌మ ఆదేశాల‌ను తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని కూడా వారిద్ద‌రినీ ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించిందని తెలుస్తోంది.

గ‌తంలో ఓ కేసు విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమ‌లు ప‌ర‌చ‌డంలో ఈ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. దీంతో.. బాధితులు కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టుగా తెలిసింది. విచారించిన న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ.. పై విధంగా శిక్ష విధించిన‌ట్టు స‌మాచారం.