Begin typing your search above and press return to search.
కోచింగ్ సెంటర్ ఆ రైల్వే స్టేషన్ .. అసలు సంగతేమిటంటే
By: Tupaki Desk | 8 Oct 2021 8:30 AM GMTఉద్యోగాల కోసం కష్టపడి చదివే వారికి బీహార్ లోని సాసారామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోచింగ్ కేంద్రంగా మారింది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు ఆ రైల్వే స్టేషన్ లోని 1, 2 ఫ్లాట్ ఫారాలు నిత్య అభ్యాసకులతో నిండిపోతాయి. సివిల్ సర్వీసెస్, బ్యాంకు కొలువులు, గ్రూప్ ఎగ్జామ్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా ఈ రైల్వే స్టేషన్ ను స్టడీ సెంటర్ గా మార్చుకున్నారు. 2002 నుంచి ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులకు సాసారామ్ రైల్వే స్టేషన్ శిక్షణ కేంద్రంగా మారింది. సమీపంలోని గ్రామాలు చిన్నపట్టణాల్లో నివాసం ఉండే వారు నిత్యం కరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో 24 గంటలు విద్యుత్ సౌకర్యం ఉండే సాసారామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను తమ చదువులకు అనువైనదిగా ఎంచుకున్నారు. ప్రతి రోజూ సుమారు 1200 మంది సమీప గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి ఈ రైల్వే స్టేషన్ కు చేరుకుని ఫ్లాట్ ఫామ్ పై కూర్చొని చదువుకోవడంతోపాటు ఆయా అంశాలపై చర్చించుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షల కోసమేగాక, ఇంటర్వూలకు కూడా ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇది ఎంతగా పాపులర్ అయిదంటే, ఈ రైల్వే స్టేషన్ పేరుతో ప్రత్యేక స్టడీ గ్రూపులు కూడా ఏర్పాటైనంతగా. సీనియర్లు ఇక్కడకు వచ్చి జూనియర్లకు కోచింగ్ కూడా ఇస్తారు. వారి సందేహాలను తీరుస్తారు. రైల్వే స్టేషన్ అధికారులు కూడా విద్యార్థులకు ఎంతో మద్దతుగా నిలిచారు.
చదువుకునేవారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చారు. తమ స్టేషన్ ఎందరినో జీవితంలో స్థిరపడేలా చేసిందని గర్వంగా చెప్పుకునేవారు. కొంతమంది విద్యార్థులు అసలు ఇంటికి వెళ్లేవారు కాదని, రాత్రి పూట ఇక్కడే పడుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇటీవల దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేయడంతోపాటు కోచింగ్ కేంద్రంగా మారిన సాసారామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి వివరించారు. దీంతో ఈ చదువుల రైల్వే స్టేషన్ మరోసారి అందరి మదిలో మెదిలింది. అయితే భద్రతా కారణాలతో స్టడీ గ్రూపులను రైల్వే స్టేషన్ అధికారులు నిషేధించారు. దీంతో ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ బోసిపోతున్నది.