Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని పెద్ద మనిషిని చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
By: Tupaki Desk | 7 Oct 2020 4:45 AM GMTమీదో ఉమ్మడి కుటుంబం. ఏళ్ల తర్వాత ఆస్తులు.. అప్పుడు పంచుకున్నారు. వాటాల లెక్కలు బాగానే ఉన్నా.. విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆస్తుల నిర్వహణ లెక్కల్లో తేడాలు వచ్చాయనుకుందాం. అప్పుడేం చేస్తాం? అన్నే కదా? అన్న భరోసాతో చూసిచూడనట్లుగా ఉండటం. లేదంటే.. తమ్ముడే కదా అని అన్న ఉద్దేశంతో.. సర్లేరా.. మన మధ్య గొడవలేంది? ఇలా చేసుకుందామా? అంటూ పరిష్కార మార్గాలు చూపించుకోవటం.. ఇద్దరికి ఆమోదయోగ్యమైన దానికి ఓకే చెప్పుకోవటం. దీనికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. తమ్ముడి ఇంటికి అన్న రావటం.. అన్న ఇంటికి తమ్ముడు వెళ్లటమో చేస్తే సరిపోతుంది.
అందుకు భిన్నంగా.. మనిద్దరికి లెక్క తేలటం లేదు.. వెళ్లి ఊరి పెద్ద దగ్గరకు వెళతామని వెళ్లి.. తమ వాదనల్ని వినిపించినప్పుడు.. సరే తీర్పు చెబుతా కానీ.. ముందు మీ ఇద్దరి ఆస్తుల చిట్టా తీసుకురండి.. అన్ని చూశాక లెక్క తేలుస్తా? అని అన్నారనుకోండి? ఏం చేస్తారు. దీంతో సరిపెట్టకుండా.. నేను తీర్పు చెప్పే వరకు మీరిద్దరు ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఏ పని చేయొద్దు అన్నారనుకోండి? ఏం చేస్తారు?
ఇదంతా చదివినప్పుడు.. లెక్క తేడా ఉంటే.. కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి.. ఎవరో ఊరి పెద్ద దగ్గర ఇద్దరి ఆస్తుల లెక్క చూపించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలుగక మానదు. ఎందుకిలా అంటే.. అన్న గుట్టు తమ్ముడికి.. తమ్ముడి చరిత్ర అన్నకు తెలియంది కాదు. అలాంటప్పుడు ఇద్దరి గుట్టుమట్లు ఊరి పెద్ద మనిషికి చెబితే.. ఆ ఇద్దరిని కంట్రోల్ చేసే అవకాశం సదరు పెద్ద మనిషికి వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల పంచాయితీల విషయంలో ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ లు ఇలానే చేశారని చెప్పాలి.
తాజా పంచాయితీలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే గోదావరి నదీ యాజమాన్య బోర్డు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇద్దరు సీఎంలకు చెప్పింది. అంటే.. ఈ రెండు నదులపై ప్రాజెక్టుల్ని పరోక్షంగా కంట్రోల్ చేసేది తానేనన్న విషయాన్ని కేంద్రం చెప్పకనే చెప్పినట్లైంది కదా? చేతిలో ఉన్న విశేష అధికారాల్ని వదిలేసి.. కేంద్రం చేతికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చి రావటం ఏమిటి? అన్న ప్రశ్న స్కూలుకు వెళ్లే చిన్నపిల్లాడికి సైతం అర్థమవుతుంది. మరీ విషయం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎందుకు అర్థం కాలేదంటారు? ఇదంతా చూసినప్పుడు తెలుగు రాష్ట్రాల మీద పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న కేంద్రానికి అప్పనంగా అవకాశం లభించినట్లుగా చెప్పక తప్పదు.