Begin typing your search above and press return to search.

క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎంవోకు ఉంది : ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   11 Oct 2020 6:50 AM GMT
క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎంవోకు ఉంది : ఏపీ ప్రభుత్వం
X
ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటీషనర్లకు లేదని.. జిల్లాలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎంవోకి ఉందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి సహా కొందరు హైకోర్టులో అనుబంధ పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై అక్టోబర్ 6న విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. చట్ట ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీస్ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టుకు నివేదించింది.

ప్రతి జిల్లాలోనూ వసతి ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎం కార్యాలయానికి ఉందని ఏపీ ప్రబుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత క్యాంప్ ఆఫీసు నుంచే సీఎం పనిచేయాలని డిమాండ్ చేసే హక్కు పిటీషనర్లకు లేదని.. అలాగే జిల్లాల్లో సీఎంవోగా దేనిని ఉపయోగించుకోకూడదని చెప్పే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఏమిటీ? అది ఎక్కడ ఉండాలని ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది. దీనిపై వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ నివేదించారు. ‘క్యాంపు ఆఫీసు’ అనే పదానికి ఏపీ సీఆర్డీఏ చట్ట నిబంధనలు వర్తించవని పేర్కొన్నారు.అందువల్ల అనుబంధ పిటీషన్ కొట్టేయండని విన్నవించారు.