Begin typing your search above and press return to search.

చైనా ప్రభుత్వం వింత నిర్ణయం.. అయోమయం లో విమానయాన సిబ్బంది..!

By:  Tupaki Desk   |   11 Dec 2020 6:21 AM GMT
చైనా ప్రభుత్వం వింత నిర్ణయం.. అయోమయం లో విమానయాన సిబ్బంది..!
X
చైనా ప్రభుత్వం ఓ వింత నిర్ణయం తీసుకున్నది. విమానయాన సిబ్బంది విధిగా డైపర్​లు ధరించాలని ఆదేశించింది. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాల్లో బాత్రూమ్​లు వాడొద్దని సూచించింది. కరోనా కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా ప్రకటించింది. లాక్​డౌన్​ సడలింపులు మొదలయ్యాక.. అన్ని దేశాల్లోనూ విమానయాన సేవలు పునః ప్రారంభమయిన విషయం తెలిసిందే. దీంతో చైనా కూడా విమానయాన సర్వీసులు స్టార్ట్​ చేసింది. కాగా కరోనా కట్టడికోసం చైనా విమానయాన సిబ్బంది విధిగా డైపర్​లు ధరించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నది.

500లకు పైగా కొవిడ్‌-19 కేసులున్న దేశాలకు వెళ్లే విమానాల్లో ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.ఈ మేరకు చైనా విమానయాన శాఖ తమ సిబ్బందికి 38 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది చేతులకు గ్లౌవ్స్​ విధిగా ధరించాలని.. మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. ప్రభుత్వం చేసిన ఉత్తర్వులపై విమానయాన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో డైపర్లు వాడటం ఏంటి అని అంటున్నారు.

మరోవైపు విమానయాన సిబ్బంది డైపర్లు ధరించాలన్న నిర్ణయంపై సోషల్​మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది. వింత నిర్ణయాలు తీసుకోవడంలో చైనా ఎప్పుడూ ముందుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై జోకులు వేస్తున్నారు. విమానయాన సిబ్బందికి అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. చైనా మాత్రం ప్రయాణికులు శ్రేయస్సు కోసం, కరోనాకు అడ్డుకట్టవేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.