Begin typing your search above and press return to search.
చికెన్ కోమా లో నుండి బయటకి వచ్చేలా చేసింది ..ఎలా అంటే !
By: Tupaki Desk | 10 Nov 2020 6:00 AM ISTచికెన్ ..చికెన్ .. చికెన్ ఈ పేరు వింటే అందరి నోళ్లల్లో కూడా నీళ్లు ఊరడం ఖాయం. భోజన ప్రియులకి చికెన్ ఓ పసందైన విందు. మాంసాహారమే తినేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ సమయాల్లో చికెన్ తినడం వేరు. ఇక ఫుల్లుగా ఆకలి వేసినప్పుడు తింటే..అబ్బా ఇక చాలు ఈ జీవితానికి అంటారు. తాజాగా వ్యక్తి కూడా రెండు నెలల పాటు కోమాలో ఉండి.. చికెన్ పేరు వినంగానే లేచి.. ‘ఎక్కడ.. చికెన్ ఎక్కడ...’ అంటూ గుటుక్కున మింగేశాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది , ఏంజరిగింది అంటే ?
తైవాన్ కు చెందిన చియూ టీనేజ్ కుర్రాడు. కొద్దిరోజుల క్రితం అతడు బైక్ డ్రైవ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా , వైద్యులు బతకడం కష్టమే అన్నారు. ఆరు ఆపరేషన్లు చేశారు. ప్రాణమైతే ఉంది.. కానీ ఎప్పుడు ఎలా లేస్తాడో తెలియదు. తల్లిదండ్రులకు ఎక్కడో ఒక ఆశ. ‘నా కొడుకు తిరిగి లేవకపోతాడా..? మళ్లీ మాతో కలిసి ఉండకపోతాడా అని చిన్న ఆశ. భగవంతుడి మీద భారం వేశారు. అలా రోజులు గడుస్తున్నా ఎటువంటి చలనం లేదు , రెండు నెలలు కావొస్తుంది. కొడుకు లేవడం లేదు. ఇంతలో చియూ అన్న ఆస్పత్రికి వచ్చాడు. తమ్ముడి దగ్గరకు వెళ్లి.. ‘తమ్ముడూ.. నీ కోసం నేను చికెన్ ఫిల్లెట్ తీసుకొచ్చాను. నూవు లేవకుంటే నీది కూడా నేనే తింటాను.. ఇదిగో తినబోతున్నాను...’ అంటూ తమ్ముడి చెవిలో చెప్పాడు.
దాని తర్వాత జరిగిన సంఘటన అక్కడున్నవారికి నమ్మడానికి చాలా టైం పట్టింది. అప్పటిదాకా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక క్రమంలో వెళ్తున్న ఈసీజీ లైన్లు.. వరుస మార్చుకున్నాయి. పల్స్ వేగంగా కొట్టుకో సాగింది. చియూలో కదలిక. ముందు వేళ్లు.. చేతులు.. కాళ్లు.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అవయవాల్లో కదలిక వచ్చింది. ఉన్నట్టుండి చియూ లేచి కూర్చున్నాడు. అది చూసి అక్కడున్న వాళ్లు వారి కళ్లను వారే నమ్మలేదు. చియుకి చికెన్ అంటే భలే ఇష్టమట. ఇంట్లో చికెన్ వండితే గిన్నెలు ఖాళీ కావాల్సిందేనట.ఇది గ్రహించిన ఆయన అన్నయ్య.. తన తమ్ముడిని బతికించుకోవడానికి ఆఖరి ప్రయత్నంగా తీసుకొచ్చిన చికెన్ అతడికి తిరిగి ప్రాణాలు పోసింది. ఇప్పుడా యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేగాక ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు.