Begin typing your search above and press return to search.

కేంద్రం కీలక నిర్ణయం.. బెట్టింగ్ గేమ్ లపై బ్యాన్

By:  Tupaki Desk   |   7 April 2023 4:00 PM GMT
కేంద్రం కీలక నిర్ణయం.. బెట్టింగ్ గేమ్ లపై బ్యాన్
X
కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్.. బెట్టింగ్ లను నియంత్రించే పనిలో పడింది. ఇందులో భాగంగా సరికొత్త నియమావళిని తీసుకొచ్చింది. డబ్బులు పెట్టి ఆడే గేమ్ లను బెట్టింగ్ లు చేసే గేమ్ లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆన్ లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ పాటించే విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఇప్పటికే తీసుకొచ్చిన చట్టాలకుకొత్త నిబంధనల్ని చేర్చారు.

2021లో తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు సవరణలు చేస్తూ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో అసలైన డబ్బులతో పందేలు కాసే వాటిని బ్యాన్ చేవారు. పిల్లలకు వ్యసనంగా మారే అవకాశం ఉన్న గేమ్ ల పైనా కన్నేస్తారు. పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

తాము తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో దేశంలో ఆన్ లైన్ గేమింగ్ మరింత పెరిగేందుకు తోడ్పాటును అందిస్తుందన్న ఆశాభావాన్నివ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేలా.. పరిశ్రమలో పోటీ తత్త్వాన్ని పెంచేందుకు దోహదపడేలా కొత్త మార్పులు ఉండనున్నాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్ ఫాంలను ఏరి వేసి.. అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీ పడేలా ప్రోత్సాహాన్ని అందిస్తామని కేంద్రమంత్రిత్వ శాఖ చెబుతోంది.

గేమింగ్ వ్యసనంగా మారకుండా ఉండేందుకు.. ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు.. మోసాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. దీని ప్రకారం ఒక గేమింగ్ సెషన్ లో ఒక సమయం దాటితే..పదే పదే వార్నింగ్ మెసేజ్ లు పంపేందుకు వీలుగా గేమింగ్ సంస్థలు తమ ప్రోగ్రాంను మార్చుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు నిబంధనల ప్రకారం ఆన్ లైన్ గేమ్స్ ను నియంత్రించేందుకు వీలుగా ఒక విద్యావేత్త సైకాలజీ నిపుణుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్న వ్యక్తి లేదంటే అధికారితో కలిసిన టీం పని చేస్తుంటుంది. ఏదైనా గేమింగ్ ప్లాట్ ఫాం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకుంటే దాన్ని డీనోటిఫై చేస్తామని కేంద్రం వెల్లడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.