Begin typing your search above and press return to search.

అందులో కేంద్రం పాత్ర సున్నా ..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   20 May 2020 6:50 AM GMT
అందులో కేంద్రం పాత్ర సున్నా ..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !
X
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ 75 శ్రామిక్ రైళ్లలో దాదాపు లక్ష మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి రూ.6కోట్లు చెల్లించిందన్నారు. కూలీల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని.. మంచినీరు,భోజనానికి కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర సున్నా అని స్పష్టం చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని స్పష్టం చేశారు.

దీనిపై ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందించారు. తెలంగాణలో చిక్కుకుపోయిన మేఘాలయ ప్రజలను తిరిగి అక్కడికి తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంగ్మా కర్నాడ్ ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారని మరో ట్వీట్ ‌లో కేటీఆర్ తెలిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు మే 21వ తేదీన మేఘాలయకు ప్రత్యేక రైలు సర్వీసు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇక ట్విట్టర్‌ లో పలువురి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

అలాగే, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బండ లింగంపల్లి కుటుంబాన్ని పరామర్శించినట్టు మరో ట్వీట్‌లో కేటీఆర్ వెల్లడించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా పలు బ్రిడ్జిలు, కల్వర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాబోయే వానాకాలం నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.