Begin typing your search above and press return to search.

కేంద్రం మెట్టుదిగదు.. రైతులు పట్టువదలరు..! ఈ సమస్య ఇప్పట్లో తేలేటట్టు లేదు..!

By:  Tupaki Desk   |   23 Jan 2021 9:33 AM GMT
కేంద్రం మెట్టుదిగదు.. రైతులు పట్టువదలరు..! ఈ సమస్య ఇప్పట్లో తేలేటట్టు లేదు..!
X
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా పంజాబ్​, హర్యానా రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉద్యమం క్రమేపీ దేశవ్యాప్తంగా పాకింది. అయితే చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్​ చేస్తున్నారు. కొత్త వ్యవసాయచట్టాలప్రకారం.. రైతులకు పంటలపై కనీసమద్దతు ధర దక్కదు. అంతేకాక మార్కెట్​ యార్డులు ఇవ్వడం.. కాంట్రాక్ట్​ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సివస్తుంది. దీంతో వ్యవసాయరంగం కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందని అన్నదాతలు ఆందోళనచెందుతున్నారు.

మరోవైపు వ్యవసాయ చట్టాలను కూడా రైతులు వ్యతిరేకరిస్తున్నారు. దీంతో చాలారోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే మొదట్లో రైతు ఉద్యమాన్ని కేంద్రప్రభుత్వం లైట్​ తీసుకుంది. ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు వచ్చాయని.. ఖలిస్థాన్​ జిందాబాద్​ నినాదాలు వినిపిస్తున్నాయని.. ఇది అసలు ఉద్యమమే కాదని ఆరోపించింది.

అయితే కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కితగ్గింది. రైతు సంఘాలతో చర్చలకు పూనుకున్నది. ఇప్పటికే 10 సార్లు కేంద్రప్రభుత్వం.. రైతు సంఘాలు చర్చలు జరిపాయి.

తాజాగా శుక్రవారం 11 వసారి జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. అయితే ఒక సంవత్సరం పాటు కొత్తచట్టాలను అమలు చేయబోమని కేంద్రం చెబుతున్నది. దానికి కూడా రైతు సంఘాలు శాంతించడం లేదు.ఎందుకంటే ఏడాది చట్టాలను హోల్డ్​లో ఉంచుతారు. ఆ తర్వాత ఉద్యమం కూడా నీరుగారిపోతుంది. తర్వాత కేంద్రం యధావిధిగా చట్టాలను అమలు చేయాలని కుట్రపన్నిందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో సమస్య మరింత జఠిలమైంది.

అయితే కేంద్రప్రభుత్వం వ్యవసాయచట్టాలను వెనక్కి తీసుకొనేందుకు ససేమిరా అంటున్నది. కేవలం కొన్ని సవరణలకు మాత్రమే ఒప్పుకుంటున్నది. రైతులు మాత్రం చట్టాలు రద్దు చేయాలంటూ పట్టుబడుతున్నారు. రైతు ఉద్యమానికి పలు రాష్ట్రాల నేతలు కూడా మద్దతు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు సైతం ఈ అంశంపై జోక్యం చేసుకున్నది. రైతు చట్టాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటిని నియమించింది. అయితే రైతులు మాత్రం ఈ కమిటికి అభిప్రాయలు చెప్పేది లేదని తేల్చిచెబుతున్నారు. కమిటీలో ఉన్నవాళ్లంతా గతంలో రైతు చట్టాలను సమర్థించినవాళ్లేనని రైతుసంఘాలు చెబుతున్నాయి.