Begin typing your search above and press return to search.

శానిటైజర్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !

By:  Tupaki Desk   |   30 July 2020 8:30 AM GMT
శానిటైజర్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !
X
కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రతి ఇంట్లో శానిటైజర్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించడానికి అవసరమైన అస్త్రాల్లో భాగంగా దీన్ని ప్రధానంగా వినియోగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం బయటకు వస్తున్న వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటే గానీ ఇంట్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఈ శానిటైగెర్ చేతులను ఎక్కడైనా శుభ్రం చేసుకునేందుకు వీలు ఉండటంతో భారీగా డిమాండు ఏర్పడింది. ఈ నేపథ్యంలో శానిటైజర్ల కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది.

శానిటైజర్ లిక్విడ్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశంలో శానిటైజర్‌ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఎప్పటికప్పుడు ఉత్పత్తి సామర్థ్యం పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచిచింది. శానిటైజర్ అమ్మకం ధరను కూడా కేంద్రం నిర్ణయిచింది. 200 ఎంఎల్‌ ద్రావణం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎక్స్‌పైరీ డేట్ దాటిన శానిటైజర్‌ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాప్తి తరుణంలో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. శానిటైజర్‌ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండేది. ఇది నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో నిబంధనను సడలించాల్సిందిగా అనేక విజ్ఞప్తులు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల చేసిన ఓ ప్రకటన లో పేర్కొంది. ఈ మేరకు డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ నిబంధలను సడలించినట్టు వెల్లడించింది.