Begin typing your search above and press return to search.

వలసకూలీల మృతిలో కేంద్రం తప్పేలేదట! పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మంత్రి

By:  Tupaki Desk   |   16 Sep 2020 7:10 AM GMT
వలసకూలీల మృతిలో కేంద్రం తప్పేలేదట! పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మంత్రి
X
కరోనా మహమ్మారి వలసకూలీల బతుకులను ఛిద్రం చేసింది. లాక్​ డౌన్​ తో ఉపాధి దొరక్క వారు ఎంతో ఇబ్బంది పడ్డారు. పోనీ సొంతూళ్లకు వెళ్దామంటే రవాణా లేదు. దీంతో వేలమంది వలస కూలీలు కాలి నడకన స్వస్థలాలకు బయల్దేరారు. వేల కిలోమీటర్లు నడవాల్సి రావడంతో ఎండకు సొమ్మసిల్లి కొందరు ప్రాణాలు కోల్పోయారు. తిండిదొరకక కొందరు చనిపోయారు. ప్రతిరోజు ప్రధాన రహదారుల పై గర్భిణులు, చంటి పిల్లలు ఎత్తుకున్న బాలింతలు నడుచుకుంటూ వెళ్లేవారు. వీళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం కూడా జాలి చూపించ లేదు. ఒకరి పై మరొకరు నిందలు మోపుకుంటూ కాలక్షేపం చేశాయి. సోనూ సూద్ లాంటి నటులు చొర‌వ తీసుకుని వ‌ల‌స కార్మికుల్ని గ‌మ్య స్థానాల‌కు చేర్చిన విషయం తెలిసిందే. మరికొందరిని స్వచ్చంద సంస్థలు ఆదుకున్నాయి. వలసకూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

కాగా ప్రస్తుతం వ‌లస కూలీలు చ‌ని పోవ‌డానికి కార‌ణం కేవ‌లం ఫేక్ న్యూస్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం బుకాయిస్తోంది. మంగళవారం పార్లమెంట్​ లో టీఎంసీ (తృణముల్​ కాంగ్రెస్​) ఎంపీ మల రాయ్​ ఈ విషయం పై ప్రశ్నించారు. లాక్​ డౌన్​ సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తో అనేక మంది వలస కూలీలు మరణించారు. దానికి ఎవరిది బాధ్యత. వలస కూలీలను ఆదుకొనేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నది అని ఆయన ప్రశ్నించారు.

దీనికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ‘లాక్‌ డౌన్ సమయం లో వలస కూలీలు ప్రాణాలు కోల్పోయిన మాట నిజ‌మే. కానీ అందుకు కారణం కేంద్రప్రభుత్వం కాదు. ఆ సమయంలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఆ భయంతోనే చాలా మంది సొంతూళ్లకు వెళ్లడం తో చని పోయారు. కేంద్రం వారిని ఆదుకొనేందుకు అన్ని విధాలా సాయం చేసింది’ అని ఆయన సమాధానం చెప్పారు. కాగా మంత్రి సమాధానం పై విపక్షాలే కాక నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అవలంభించిన తప్పుడు నిర్ణయాల వల్లే వలస కూలీలు చని పోయారని పలువురు కామెంట్లు పెడుతున్నారు.