Begin typing your search above and press return to search.
మోడీ దుకాణం: పెట్రో కంపెనీలూ అమ్మేసిందా!
By: Tupaki Desk | 30 July 2021 11:30 AM GMTకేంద్ర ప్రభుత్వం వరుస పెట్టి.. అన్నింటినీ అమ్మేస్తోందా? పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరిం త వేగవంతం చేసిందా? ఈ క్రమంలో అత్యంత కీలకమైన సంస్థలను కూడా సంతలో పెట్టి అమ్మేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. పెట్టుబడుల ఉపసంహరణను మరింత వేగం చేస్తామని.. బడ్జెట్ ప్రసంగంలోనే పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో.. ఇప్పడు ఈ వ్యహారాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
ఆరు నూరైనా.. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా.. పెట్రో కంపెనీల ను అమ్మేసేందుకు రెడీ అయింది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినిచ్చేసింది. పేరుకు విదేశీ పెట్టుబడులు కానీ… వంద శాతం అంటే.. యాజమాన్యం మారిపోవడమే. భారత్‌లో రెండో అతి పెద్ద ఆయిల్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్. దీనిలో కేంద్రప్రభుత్వానికి 52.98 శాతం వాటాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( బీపీసీఎల్ ) అమ్మకం ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కొనేందుకు మూడు విదేశీ కంపెనీలు కూడా వచ్చాయి. వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. తర్వాత దాన్ని కూడా అమ్మేసే అవకాశం ఉంటుంది.
అయితే.. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఇలా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియతో ఉన్నవాటిని అమ్మే స్తుండడంపై విమర్శలు, విశాఖ ఉక్కు వంటివాటి విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా..కేంద్రం ఏమాత్ం తగ్గడం లేదు. మరి దీనికి రీజనేమైనా ఉందా? లేక కేంద్రం దివాలా తీసిందా? వీటిని అమ్మకపోతే.. మనుగడ సాధించలేదా? అంటే.. అదేమీలేదు. కానీ, పెట్టుబడుల ఉపసంహరణకు అధికారం కేంద్రానికి ఉంది. దీనికి సంబంధించి చట్టం కూడా ఉంది. దీంతో కేంద్రం దూకుడు పెంచుతోంది.
అయితే.. పె ట్రో కంపెనీలను అమ్మేయడం వల్ల ఇప్పటికే పెట్రో ధరలపై నియంత్రణ లేకుండా పోయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో.. మరింతగా వీటి ధరలు పెంచినా.. కేంద్రం ప్రశ్నించలేని పరిస్థితి రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.