Begin typing your search above and press return to search.
దళితులకు రిజర్వేషన్ల వర్తింపుపై కేంద్రం కీలక ప్రకటన..ఏం చెప్పిందంటే?
By: Tupaki Desk | 12 Feb 2021 5:30 AM GMTదళితులకు రిజర్వేషన్ల వర్తింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేసే అంశంపై కేంద్రం పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. దళితులు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారని గురువారం పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు.
రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల జాబితాలోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారు.. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఉందా అని జీవీఎల్ ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని అన్నారు. అయితే నామినేషన్ల సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని తెలిపారు.
ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన దళితులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీచేయడానికి అనర్హులు.. అలాగే, రాజ్యాంగం కల్పించిన ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు అందుకోలేరు అని కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యాంగంలోని 3 వ పేరా ఆర్డర్ ఇలా పేర్కొంది... హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి భిన్నమైన మతాన్ని అనుసరించే ఏ వ్యక్తీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుడిగా పరిగణించరు అని అన్నారు.