Begin typing your search above and press return to search.
కండోమ్ కి చిల్లు పెట్టిన లవ్వర్ పై కేసు.. జైలు ఎన్నాళ్లంటే?
By: Tupaki Desk | 6 Oct 2020 11:10 AM GMTదారుణమైన అత్యాచారానికి ఉరిశిక్ష వేస్తే.. కొంతమంది మానవతావాదులు తెగ ఇదైపోతుంటారు. వామ్మో.. ఓరినాయనో అంటూ గుండెలు బాదేసుకోవటమే కాదు.. ఆ మాత్రం నేరానికి ఊరి వేస్తారా? అంటూ తమ విశాలమైన మనసు విప్పి చూపిస్తుంటారు. రేప్ తర్వాత.. లవ్వర్ ను మోసం చేసిన నేరానికి ఏళ్లకు ఏళ్లు జైలుశిక్ష విధించిన ఉదంతం వింటే.. రేప్ లాంటి దారుణాలకు ఉరికి మించిన శిక్ష వేస్తే బాగుంటుందనిపించక మానదు.
బ్రిటన్ లో తన పార్టనర్ కు తెలీకుండా కండోమ్ కు చిల్లు పెట్టిన ఘనుడికి అక్కడి కోర్టు విధించిన శిక్ష తెలిస్తే షాక్ తినాల్సిందే. లండన్ కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒక రకంగా లివింగ్ రిలేషన్ షిప్ లాంటిదే అనుకోండి. శారీరకంగా దగ్గర కావాలంటే తప్పనిసరిగా కండోమ్ వాడాలనే రూల్ పెట్టిందామె. అందుకు ఓకే చెప్పిన అతగాడు.. ఆమెతో కలిసి రిలేషన్ నడిపేవాడు.
మొదట్లో ఆమె చెప్పినట్లే చేసిన అతడు.. తర్వాతి కాలంలో ఆమెకు తెలీకుండా తాము వాడే కండోమ్ లకు చిల్లు పెట్టటం షురూ చేశాడు. ఒక రోజు బెడ్ మీద కండోమ్ పాకెట్.. పక్కనే సూది ఉండటాన్ని గమనించిన ఆమె.. అనుమానం వచ్చింది. వెంటనే కండోమ్ లను చెక్ చేస్తే.. వాటికి చిల్లు పెట్టిన వైనాన్ని గుర్తించింది.
దీంతో.. తనను మోసం చేసిన తీరుపై ఆ మహిళ.. కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. సదరు వ్యక్తి మోసానికి పాల్పడడ్డాడని.. నమ్మకాన్ని వమ్ము చేసిన నేరానికి నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ లెక్కన.. అత్యాచారం చేసినోళ్లకు ఏం చేయాలంటారు?