Begin typing your search above and press return to search.

పెళ్లి మ‌ధ్య‌లో వెళ్లిపోయిన వ‌ధువు!

By:  Tupaki Desk   |   4 May 2021 3:30 AM GMT
పెళ్లి మ‌ధ్య‌లో వెళ్లిపోయిన వ‌ధువు!
X
బంధువుల స‌మ‌క్షంలో పెళ్లి తంతు కొన‌సాగుతోంది. వ‌రుడు, వ‌ధువు పెళ్లిపీట‌ల‌పై ఉన్నారు. అంతా సంతోషంగా ఉన్నారు. అయితే.. పెళ్లి కూతురు మాత్రం వివాహ తంత‌ను మ‌ధ్య‌లో ఆపేసి, బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది.

అయితే.. ఆమె వెళ్లింది ఇంకెక్క‌డికో కాదు. ఎన్నిక‌ల కౌంటింగ్ కేంద్రానికి! అవును.. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆమె పోటీచేసింది. ఆదివారం కౌంటింగ్ కొన‌సాగించ‌గా.. ఆమె పెళ్లి కూడా ఇవాళే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో.. అనివార్యంగా పెళ్లి మ‌ధ్య‌లోంచి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాల్సి వ‌చ్చింది.

అంత అర్జెంట్ ఎందుకంటారా..? విన్నింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలి కదా మరి! అవును.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆ న‌వ వ‌ధువు విజ‌యం సాధించింది. ఆమె పేరు పూన‌మ్ శ‌ర్మ‌. రాంపూర్ లోని మిలాక్ బ్లాక్ లోని మ‌హ‌మ్మ‌ద్ పూర్ జ‌దీద్ గ్రామ‌వాసి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 135 వార్డు నుంచి బ‌రిలో నిలిచింది.

ఈ ఎన్నిక‌ల్లో స‌మీప ప్ర‌త్య‌ర్థిపై 31 ఓట్ల తేడాతో గెలుపొందింది. ధృవీక‌ర‌ణ ప‌త్రం తీసుకున్న త‌ర్వాత వెళ్లి, మిగిలిన పెళ్లి తంతు పూర్తి చేసింది. త‌న పెళ్లి రోజునే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతో రెండింత‌లు స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది పూన‌మ్.