Begin typing your search above and press return to search.

పెళ్లి లో గాల్లోకి వధువు కాల్పులు.. వీడియో వైర‌ల్

By:  Tupaki Desk   |   1 Jun 2021 11:30 PM GMT
పెళ్లి లో గాల్లోకి వధువు కాల్పులు.. వీడియో వైర‌ల్
X
పెళ్లి .. ఓ మధురమైన అనుభూతి. జీవితంలో ఒకే సారి వచ్చే అతి పెద్ద పండుగ. అటువంటి ..పెళ్లి లో పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జ‌రిపి వార్త‌ల్లో నిలిచింది. అంతేకాదు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌తాప్‌ ఘ‌ర్ జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే త‌న వివాహ ముహుర్తానికి ముందు స్టేజ్ ఎక్కుతున్న క్ర‌మంలో గాల్లోకి కాల్పులు జ‌రిపింది. ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. దీనితో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రూపా పాండే కాల్పులు జ‌రిపిన రివాల్వ‌ర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు.

ఈ క్ర‌మంలో రూపా పాండేతో పాటు రామ్ నివాస్‌ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. రూపా పాండే కాల్పులు జ‌రిపిన రివాల్వ‌ర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు. ఇది లైసెన్స్‌డ్ గన్ అని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రూపా పాండేతో పాటు ఆమె మామ రామ్ నివాస్‌ పై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి సంఘటనలు బీహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో తరచూ జరుగుతుంటాయి. శుభకార్యాలు జరుపుతున్న క్రమంలో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు. ఈ క్రమంలో చాలామంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.