Begin typing your search above and press return to search.

అమ్మాయికి ఆ అలవాటు ఉండకూడదట ..అతడికి జన్మలో పెళ్లి కాదు !

By:  Tupaki Desk   |   6 Oct 2020 3:45 AM GMT
అమ్మాయికి ఆ అలవాటు ఉండకూడదట ..అతడికి జన్మలో పెళ్లి కాదు !
X
సోషల్ మీడియా .. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్ ‌స్టాగ్రామ్ ఇలా పలు రకాల సోషల్ మీడియా యాప్స్ ప్రస్తుతం అందరి జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతి ఒక్కరు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా లో మునిగితేలుతుంటారు. కొందరైతే మరీ పర్శనల్ విషయాలను కూడా బయట పెట్టేస్తున్నారు. ఇంకొందరు అదే పనిగా సోషల్ మీడియాలో గడుపుతూ లోకాన్ని మరిచిపోతున్నారు. అందుకే ఓ కుటుంబం తమకు కావల్సిన వధువు కోసం ప్రత్యేకంగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అసలు వారు ఎలాంటి ప్రకటన చేసారంటే .. సాధరణంగా వధువు కావాలి లేదా వరుడు కావాలనే పెళ్లి ప్రకటనల్లో తమకు అందం, మంచి లక్షణాలు, ఉద్యోగం, ఎత్తు తదితర వివరాలను పొందుపరచడం మాములే.

అయితే ఓ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ న్యాయవాది.. ఇచ్చిన వధువు కావాలెను ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే.. అతడికి ‘సోషల్ మీడియా’కు బానిస కాని వధువు కావాలని ప్రకటన ఇచ్చాడు. ఎటువంటి కట్న కానుకలు ఆశించని వరుడికి తెలుపు, అందం, ఎత్తు పొడవు, సన్నగా ఉండే వధువు కావలెను. వధువు సోషల్ మీడియాకు బానిస కాకూడదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది చర్చనీయమైంది. దీనిపై నెటిజన్స్ భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. ఆ ప్రకటన చూసిన కొంతమంది ..నీకు ఈ జన్మలో పెళ్లి కాదు అని కుండ బద్దలు కొడుతున్నారు. మరి అంత వింత కోరిక ఏం కోరాడబ్బ అని ఆలోచిస్తున్నారు.