Begin typing your search above and press return to search.
ప్రేమ పెళ్లి.. వెంటనే తాళి తీసేసి వెళ్లిన వధువు..
By: Tupaki Desk | 26 May 2023 5:00 AM GMTప్రేమిస్తారు.. పెళ్లి చేసుకునేందుకు పెద్దవాళ్లను సైతం కాదంటారు.. ప్రేమించిన వారిని స్వంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఇదంతా కామనే కదా.. అంటారా.. కానీ ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. ప్రియుడికి షాకిచ్చిన ఆమె వెంటనే తాళి తీసి అతని చేతిలో పెట్టి వెళ్లిపోయింది. పైగా పోలీసులకు ఏం చెప్పిందో తెలుసా..
తిరుపూర్‌పూండి రింగ్ రోడ్డుకు చెందిన ఓ యువతి(23)కి కోయంబత్తూర్ జిల్లా అన్నూరు ఒటర్‌పాళయంకు చెందిన 29 యేండ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలిశాయి. మనసులు పెనవేసుకున్నాయి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరూ పార్కులు తిరుగుతూ.. షికార్లు చేస్తూ ప్రేమను మధురిమను ఆస్వాదించారు. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
ఇద్దరం ప్రేమించుకున్నామని, వివాహం చేసుకోవాలని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే యువతి తరపు బంధువులు మాత్రం వీరి పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆ యువతి మాత్రం పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని తెగేసి చెప్పింది. తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. దీంతో ఇంటి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి పారిపోయింది. ఇంట్లో ఉన్న ఐదున్నర సవర్ల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు తీసుకుని ప్రియుని వద్దకు చేరుకుంది.
వీళ్లిద్దరూ ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో యువతి తరపు బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమజంటను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెళ్లిబట్టల్లో ఉన్న కూతురును చూసిన ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. అది చూసిన వధువు మనసు చెదిరిపోయింది. వెనువెంటనే తన మనసు మార్చుకుంది. తాళి తీసి ప్రియుడి చేతిలో పెట్టి చక్కగా తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. పైగా ఈ విషయంలో తన ప్రియుడి తప్పేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే వచ్చానని, అతన్ని ఏమీ అనవద్దని పోలీసులకు చెప్పడం కొసమెరుపు.