Begin typing your search above and press return to search.
తాళికట్టు శుభ వేళ.. భారీ ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు!!
By: Tupaki Desk | 18 May 2023 5:00 AM GMTఒకవైపు కళ్యాణము చూతము రారండీ.. అంటూ మైకుల్లో పాటలు సంప్రదాయ బద్ధంగా సాగిపోతున్నాయి. ఇంకోవైపు పెళ్లి పందిట్లో పురోహితులు మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పెళ్లికి వచ్చిన వారి సందడి.. అంతా ఇంతా కాదు. పెళ్లి మండపం అంతా కోలాహలంగా మారింది. వివాహ క్రతువుకు వచ్చిన వారు.. మరో నిముషంలో మూడుముళ్లు పడతాయి వెళ్లిపోదాం.. అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. `తాళి కట్టు బాబూ` అని పురోహితుడు పెళ్లి కుమారుడిని పురిగొల్పాడు. దీంతో తనకు కాబోయే భార్యకు మూడు ముళ్లు వేసేందుకు పెళ్లి కుమారుడు ఉత్సాహంగా లేచాడు. అంతే!! అక్కడే కథ అడ్డం తిరిగింది.
తాళి కట్టు శుభ వేళ.. పెళ్లి కూతురు.. వరుడికి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. వివాహం చేసుకోనని మొండికేసింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వివాహానికి నిరాకరించింది. మెడలో తాళి కట్టే ముందు వివాహానికి అడ్డు చెప్పింది. అతడిని పెళ్లి చేసుకునేదే లేదని పట్టుబట్టింది. బంధువులు ఎంతగా వారించినా ఆమె మాట వినలేదు. దీంతో చేసేది లేక.. వివాహాన్ని రద్దు చేసుకునే పరిస్థితి వచ్చింది.
బిహార్ బాగల్పుర్లోని కహల్గావ్ ప్రాంతంలో స్థానికంగా నివసించే వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారికి.. ధనౌరా ప్రాంతాని కి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్తో పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహానికి ఇరు కుటుం బాలకు చెందిన బంధువులు వచ్చారు. వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. కొద్దిసేపట్లో దండలు మార్చుకుని, తాళి కట్టే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వరుడు వివాహ వేదిక పైకి విచ్చేశాడు.
కాబోయే వరుడిని చూడగానే యువతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు వివాహం జరగనుందనే ఆనందంతో సందడి చేసిన కిట్టూ కుమారి.. సడెన్గా మనసు మార్చుకుంది. పెళ్లికి వచ్చినవారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి మెడలో దండ వేసేందుకు నిరాకరించింది. అతడికి తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. ఇక, తాళికట్టేందుకు రెడీ అయిన వరుడిని చూసి.. `యూ బ్లాక్....యాక్` అంటూ కామెంట్లు చేసి.. పరుగు పరుగున రూమ్‌లోకి వెళ్లిపోయింది. పెళ్లికని వచ్చిన వారు.. ఈ వ్యవహారం చూసి.. ముక్కున వేలేసుకున్నారు.